న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ (కీళ్ల‌వాపు) స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ?

భార‌తీయులు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎంతో పురాత‌న కాలంగా త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్య‌త ఉంది. అనేక వ్యాధులను న‌యం చేసే ఔష‌ధాల్లో న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీన్ని ఖురాన్‌, బైబిల్‌ల‌లోనూ మిరాకిల్ హెర్బ్‌గా అభివ‌ర్ణించారు. ఆసియా దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ? దీనికి సైంటిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే…

nalla-jeelakarra-for-arthritis-in-telugu

న‌ల్ల జీల‌క‌ర్ర‌లో థైమోక్వినోన్ అన‌బ‌డే ప్ర‌ధాన‌మైన బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. అందులో భాగంగానే సైంటిస్టులు న‌ల్ల జీల‌క‌ర్ర‌పై ప‌రిశోధ‌న‌లు చేయ‌గా.. ఇందులోని ఔష‌ధ గుణాలు ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయ‌ని వెల్ల‌డైంది. 40 మంది మ‌హిళ‌ల‌కు న‌ల్ల జీల‌క‌ర్ర నుంచి త‌యారు చేసిన నూనె క‌లిగిన క్యాప్సూల్స్‌ను నెల రోజుల పాటు నిత్యం ఇచ్చారు. ఈ క్రమంలో వాపున‌కు లోనైన వారి కీళ్ల‌లో కొంత వ‌ర‌కు స‌మ‌స్య త‌గ్గిన‌ట్లు గుర్తించారు. అలాగే ఉద‌యాన్నే కీళ్ల‌కు ఏర్ప‌డే దృఢ‌త్వం అనే స‌మ‌స్య కూడా త‌గ్గిన‌ట్లు గుర్తించారు. దీంతో న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్‌కు ప్ర‌త్యామ్నాయంగా ప‌నిచేసే ఔష‌ధ‌మ‌ని వారు తేల్చారు. దీన్ని ఉప‌యోగించి న్యూట్రిష‌న్ పిల్స్ త‌యారు చేసుకోవ‌చ్చ‌ని వారు ఔష‌ధ త‌యారీ కంపెనీల‌కు సూచించారు.

అయితే న‌ల్ల జీల‌క‌ర్ర‌ను మోతాదుకు మించి వాడ‌కూడ‌ద‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు. అలాగే గ‌ర్భిణీలు, పిల్ల‌ల‌కు దీన్ని ఇవ్వ‌కూడ‌ద‌ని అంటున్నారు. భోజ‌నం చేశాకే న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకోవాల‌ని అంటున్నారు. ఇక డ‌యాబెటిస్ ఉన్న‌వారు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను తీసుకునే ముందు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల‌ని అంటున్నారు. కాగా న‌ల్ల జీల‌క‌ర్రను నిత్యం పొడి రూపంలో లేదా నూనె రూపంలో తీసుకోవ‌చ్చు. దీన్ని భోజ‌నంలో క‌లిపి తిన‌వ‌చ్చు. లేదా స‌ప్లిమెంట్ల రూపంలో వాడ‌వ‌చ్చు. ఎలా వాడినా ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అయితే స‌ప్లిమెంట్లు వాడ‌ద‌లుచుకున్న‌వారు డాక్ట‌ర్‌ను సంప్ర‌దిస్తే మంచిది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts