సెయింట్ లూయీస్ లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్లు ఇటీవలే ఒక పరిశోధనలో నికోఇనమైడ్ మోనోన్యూక్లియోటైడ్ అనే పదార్ధాన్ని కనుగొన్నారు. ఇది డయాబెటీస్ వ్యాధిని నివారించటంలోను, నిరోధించటంలోను అమోఘంగా పని చేస్తుందని వెల్లడించారు. వీరు తమ పరిశోధనలలో డయాబెటీస్ ఎలుకలను ఉపయోగించారు. వాటిలోని బ్లడ్ షుగర్ మెటబాలిజం సాధారణంగా వున్నట్లు కనుగొన్నారు.
ఈ వైద్యం చేయబడిన ఆడ డయాబెటిక్ ఎలుకలు సాధారణమైన గ్లూకోజ్ టాలరెన్స్ కలిగి వున్నాయని మగ ఎలుకలలో కొంత ప్రభావం చూపిందని వీరు వెల్లడించారు. ఈ వైద్యం చాలా అపురూపమైనదని డయాబెటిక్ లక్షణాలను కనీసం ఎలుకలలో త్వరగా పోగొడుతోందని రీసెర్చర్లు తెలిపారు.
పరిశోధనా ఫలితాలు ఈ పదార్ధాన్ని ఒక రోజువారీ విటమిన్ వలే వాడేలా తయారు చేస్తున్నాయని దీనితో టైప్ 2 డయాబెటీస్ నివారణ సాధ్యమని వీరు తెలిపారు. అయితే, డయాబెటీస్ రోగులపై దీనిని ఇంకా ప్రయోగించాల్సిన అవసరం వున్నదని, తమ పరిశోధనలు విజయవంతమైతే, డయాబెటీస్ వ్యాధితో బాధపడే మిలియన్ల జనాభాకు ఊరట కలుగగలదని వీరు వెల్లడించారు.