ఆరోగ్యం

విట‌మిన్ డి త‌గ్గితే అధికంగా బ‌రువు పెరుగుతారు.. విట‌మిన్ డి ఎంత ఉండాలో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరంలో ఎముక‌లు, దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం. వాటి ఆరోగ్యానికి విట‌మిన్ డి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంది. అందువ‌ల్ల విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటుండాలి. అయితే శ‌రీరంలో త‌గినంత విట‌మిన్ డి లేక‌పోతే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హానిక‌ర ప‌రిణామాలు ఏర్ప‌డుతాయి.

vitamin d deficiency can lead to over weight know how much level it is required

విట‌మిన్ డి శ‌రీరంలో త‌గినంత లేక‌పోతే అధికంగా బ‌రువు కూడా పెరుగుతారు. క‌నుక విట‌మిన్ డిని త‌గినంత అందేలా చూసుకోవాలి. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నం ప్ర‌కారం విట‌మిన్ లోపం ఉన్న‌వారు స్థూల‌కాయం బారిన ప‌డ‌తార‌ని వెల్ల‌డైంది. విట‌మిన్ డి లోపం ఉంటే అధికంగా బ‌రువు పెరుగుతారు.

విట‌మిన్ డి లోపం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం త‌గ్గుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చుకావు. ఫ‌లితంగా బ‌రువు పెరుగుతారు. ఈ అధ్య‌యనానికి చెందిన వివ‌రాల‌ను సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్న‌ల్‌లో ప్ర‌చురించారు. అందువ‌ల్ల విట‌మిన్ డికి, శ‌రీరంలో ఉన్న కొవ్వుకు సంబంధం ఉంటుంద‌ని స్ప‌ష్టంగా తేలింది. నార్త్ క‌రోలినా స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు ఈ అధ్య‌య‌నాన్ని చేప‌ట్టారు.

విట‌మిన్ డి లోపం ఉంటే మెట‌బాలిక్ వ్యాధులు వ‌స్తాయి. ట్రై గ్లిజ‌రైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. కీళ్ల నొప్పులు వ‌స్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న ఉంటాయి. మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకోలేదు. అందువ‌ల్ల విట‌మిన్ డి ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

ఇక మ‌న‌కు రోజుకు 600 ఐయూ మోతాదులో విట‌మిన్ డి అవ‌స‌రం. గ‌ర్భిణీల‌కు రోజుకు 800 ఐయూ మోతాదులో విట‌మిన్ డి అవ‌స‌నం అవుతుంది. చిన్నారుల‌కు 200 ఐయూ మేర విట‌మిన్ డి కావాలి. రోజూ సూర్య ర‌శ్మిలో ఉద‌యం 20 నిమిషాలు శ‌రీరానికి ఎండ త‌గిలేట్లు ఉంటే చాలు, రోజుకు మ‌న‌కు కావ‌ల్సిన విట‌మిన్ డిని శ‌రీరం త‌యారు చేసుకుంటుంది. లేదా పుట్ట గొడుగులు, పాలు, నెయ్యి, చేప‌లు వంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న‌కు విట‌మిన్ డి ల‌భిస్తుంది. విట‌మిన్ డి స‌రిగ్గా ల‌భిస్తే అధికంగా బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు.

Admin

Recent Posts