Sachin Tendulkar And Anjali : క్రికెట్ ఆఫ్ గాడ్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన క్రికెట్ లో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ క్రికెట్ లెజెండ్… క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఎన్నో ఏళ్లు గడిచిపోయింది. క్రికెటర్లలో సచిన్ ప్రేమకథ మాత్రం చాలా మందికి ఎవర్‌గ్రీన్ ఫెవరెట్. ఇప్పటికీ సచిన్ ఏదో ఒక సందర్భంలో కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. అయితే సచిన్ తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని 1995లో పెళ్లి చేసుకున్నాడు సచిన్ కంటే అంజలి ఐదేళ్లు పెద్దది. పెళ్లికి వధువు వయస్సు గురించి సమాజంలోని అపోహలను అతను బద్దలు కొట్టాడు. నేటికీ పెళ్లిలో వయసు అనే టాపిక్ వచ్చినప్పుడు సచిన్-అంజలిని ఉదాహరణగా తీసుకువస్తున్నారు.
సచిన్ ప్రేమపై ఓ సినిమా తీయవచ్చు. 1990లో ఎయిర్‌పోర్టులో అంజలిని సచిన్ తొలిసారిగా చాలా చిత్రమైన రీతిలో చూశాడు. గుంపులో చాలా మధురమైన ముఖాన్ని చూడగానే కర్లీ జుట్టు గల కుర్రాడి గుండెలో గంటలు మ్రోగాయి.. ఆ కుర్రాడు ఎవరో కాదు సచిన్ . 1990లో ఓ అంతర్జాతీయ టూర్ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్…ఆ సమయంలో తన తల్లిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన అంజలిని ఎయిర్‌పోర్టులో చూసి, తొలి చూపులోనే మనసు పారేసుకున్నాడు. ఆ తర్వాత ఓ పార్టీలో స్నేహితుల ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా, ప్రేమగా మారింది.
‘నాకు క్రికెట్ గురించి ఏమీ తెలీదు, సచిన్‌కి నేను ఎక్కువగా నచ్చడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. టెండూల్కర్ పరిచయం వరకూ నాకు సచిన్ ఎవ్వరో కూడా తెలీదంటే నమ్మరేమో’ అని చెప్పుకొచ్చింది అంజలి.అంజలి, సచిన్ టెండూల్కర్ కలిసి ఓ మూవీకి వెళ్లారు. తనని చూస్తే జనం గుమగూడతారని థియేటర్‌కి లేటుగా వెళ్లాడు సచిన్. అయితే ఇంటర్వెల్‌లో సచిన్‌ను చుట్టుముట్టేశారు జనం. టెండూల్కర్ ఫాలోయింగ్ చూసి షాక్ అయ్యింది అంజలి. అయితే ఒక రోజు అంజలి జర్నలిస్టుగా సచిన్ ఇంటికి వెళ్లింది. అలా ఓ రోజు అంజలి తొలిసారి సచిన్ ఇంటికి వెళ్లటం. అయితే సచిన్‌కు అంజలి చాక్లెట్లు ఇవ్వడంపై అతడి తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ‘నువ్వు నిజంగా జర్నలిస్టువా?’ అని ప్రశ్నించింది. 1990లలో మొబైల్ ఫోన్స్ చేయడం పెద్ద ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి సచిన్‌తో మాట్లాడాలంటే తన కాలేజీ క్యాంపస్ దాటి టెలిఫోన్ బూత్‌కు వెళ్లి అక్కడ నుంచి కాల్ చేసేదట. అయితే, సచిన్ తరచూ విదేశీ టూర్లకు వెళ్తున్న కారణంగా బిల్ ఎక్కువగా వస్తుందని భావించి లెటర్స్ రాయడం మొదలుపెట్టింది.