సూర్య కుమార్ యాదవ్, ఈ పేరు ఇప్పుడు ఇండియన్ క్రికెట్ లో ఓ వైబ్రేషన్. అద్భుతమైన ఆట తీరుతో చెలరేగిపోతున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఆయన ఆటతీరుతో రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న సూర్య కుమార్ యాదవ్, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. సూర్య ఇన్నింగ్స్ పై పలువురు క్రికెట్ విశ్లేషకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సూర్య సారథ్యంలో ఇండియన్ జట్టు ఈ మధ్య కాలంలో పలు సిరీస్‌లను కూడా కైవసం చేసుకుంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా సూర్యను కెప్టెన్‌గా కోచ్ గంభీర్ తీర్చిదిద్దుతున్నారు.
ఇక సూర్య కుమార్ ముంబై ఇండియన్స్ జట్టులోనూ సభ్యుడు అన్న విషయం తెలిసిందే. సూర్య కుమార్ యాదవ్ తనదైన శైలిలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. ముఖ్యంగా సూర్య వెనక్కి ఆడే పుల్ షాట్ చాలా ప్రత్యేకమైందని చెప్పవచ్చు. మైదానంలో ఏ వైపు అయినా సరే సిక్స్‌లను కొట్టగల సమర్థుడు సూర్య. అందుకనే ఏబీ డివిలియర్స్ తరువాత సూర్యను 360 డిగ్రీ ప్లేయర్ అని పిలుస్తుంటారు. అయితే సూర్య ఇలా ఆడడం వెనుక ఆయన భార్య ప్రమేయం ఉందన్న విషయం చాలా మందికి తెలియదు.
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ సూర్య కుమార్ యాదవ్ గురించి మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో సూర్య కుమార్ కంటే శక్తివంతమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ను చూడలేదు. అతడికి క్రికెట్ బాల్ ఫుట్బాల్ లాగా కనిపిస్తుంది కాబోలు అంటారు. సూర్య కుమార్ తన బ్యాట్ తో ప్రత్యార్థులను భయపెడుతున్నాడని చెబుతారు. ఇక సాధారణంగా అతను క్రీజు లోకి వచ్చి బ్యాటింగ్ మొదలు పెట్టాక, రెండు, మూడు బంతులు సేఫ్ గా ఆడతాడు. ఇక అప్పుడు ఒక బలహీనమైన బంతి కోసం వెయిట్ చేస్తాడు. చాలా షాట్లు లాఫ్టెడ్ లేదా 30 గజాల సర్కిల్ పైకి కొట్టడానికి ప్రయత్నిస్తాడు. టూర్ లో ఉన్నప్పుడు సూర్య కుమార్ భార్య కచ్చితంగా ఒక నియమాన్ని పాటిస్తారు. మ్యాచ్ కు చాలాసేపటికి ముందే అతడి ఫోన్ తీసుకుంటారు. దానివల్ల అతడి పై అనవసర ఒత్తిడి ఉండదు. మానసికంగా అతడు మ్యాచ్ ఆలోచనలలో మునిగిపోతాడు. హాయిగా బ్యాటింగ్ చేస్తాడు.. అని సూర్యకు తెలిసిన వారు చెబుతుంటారు.