Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home technology

ఈ 10 టిప్స్ పాటిస్తే మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను చాలా వ‌ర‌కు పెంచుకోవ‌చ్చు తెలుసా..?

Admin by Admin
January 30, 2025
in technology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నేటి త‌రుణంలో చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య బ్యాట‌రీ బ్యాక‌ప్‌. ఎంత పెద్ద బ్యాట‌రీ ఉన్న ఫోన్ కొన్నా ఎక్కువ బ్యాక‌ప్ రావ‌డం లేద‌ని చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. కొంద‌రు త‌క్కువ బ్యాట‌రీ ఉన్నా చాలా పొదుపుగా దాన్ని వాడుకుంటారు. దీంతో ఎక్కువ బ్యాక‌ప్ వ‌స్తుంది. అయితే నిజానికి ఎవ‌రైనా స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ ఎక్కువ సేపు రావాలంటే ఏం చేయాలో తెలుసా..? కింద ఇచ్చిన సూచ‌న‌ల‌ను పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీ బ్యాక‌ప్ క‌చ్చితంగా పెరుగుతుంది. ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే వైబ్రేష‌న్ ఫీచ‌ర్‌ను ఆఫ్ చేయండి. ఎందుకంటే ఈ ఫీచర్ ఆన్‌లో ఉండ‌డం వ‌ల్ల ఎక్కువ బ్యాట‌రీ వాడుకుంటుంది. కాల్స్, ఎస్ఎంఎస్‌లు, ఇత‌ర యాప్‌ల‌కు చెందిన నోటిఫికేష‌న్లు వ‌చ్చిన‌ప్పుడు వ‌చ్చే వైబ్రేష‌న్ కానీ, లేదంటే టైప్ చేస్తున్న‌ప్పుడు, ఫోన్‌ను ప‌ట్టుకున్న‌ప్పుడు వ‌చ్చే వైబ్రేష‌న్‌లు అన్నింటినీ ఆఫ్ చేయాలి. దీంతో బ్యాట‌రీ బ్యాక‌ప్ కొంత వ‌ర‌కు పెరుగుతుంది.

సాధ్య‌మైనంత వ‌ర‌కు బ్లాక్ క‌ల‌ర్ ఉన్న వాల్‌పేప‌ర్ల‌నే సెట్ చేసుకోండి. ఎందుకంటే ఆ వాల్‌పేప‌ర్లు త‌క్కువ బ్యాట‌రీని వాడుకుంటాయి. అదే క‌ల‌ర్‌ఫుల్ వాల్‌పేప‌ర్లు అయితే బ్యాట‌రీని ఎక్కువ‌గా వాడుకుంటాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే జీపీఎస్‌ను ఎప్పుడూ ఆన్‌లో ఉంచ‌వ‌ద్దు. ఎందుకంటే జీపీఎస్ ఆన్‌లో ఉంటే బ్యాట‌రీ ఎక్కువ‌గా వినియోగం అవుతుంది. అవ‌స‌రం అనుకుంటేనే దాన్ని ఆన్ చేయండి. మీ ఫోన్‌కు చెందిన ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోండి. ఆయా కంపెనీలు తాము విడుద‌ల చేసే ఫోన్ మోడ‌ల్స్‌కు అప్‌డేట్స్‌ను ఇస్తుంటాయి. వాటిని వేసుకుంటే బ్యాట‌రీ స‌మ‌స్య‌లు పోతాయి. దీంతో బ్యాక‌ప్ పెరుగుతుంది.

how to increase your android smart phone battery backup

స్మార్ట్‌ఫోన్‌లో అవ‌స‌రం అనుకున్న‌ప్పుడే మొబైల్ డేటాను ఆన్ చేసి ఉంచండి. లేదంటే ఎక్కువ బ్యాట‌రీ వినియోగం అవుతుంది. అలాగే ఫోన్‌ను కొద్ది సేపు వాడం అని అనుకున్న‌ట్ట‌యితే ఎరోప్లేన్ మోడ్‌లో పెట్టండి. దీని వ‌ల్ల బ్యాట‌రీ చాలా వ‌ర‌కు పెరుగుతుంది. ఫోన్ లో హోం స్క్రీన్ పై వాతావ‌ర‌ణం, మ్యాప్స్‌, మ్యూజిక్‌, గ్యాల‌రీ వంటి ర‌క ర‌కాల విడ్జెట్ల‌ను చాలా మంది పెడ‌తారు. కానీ వాటి వ‌ల్ల బ్యాట‌రీ బాగా వృథా అవుతుంది. క‌నుక ఆయా విడ్జెట్ల‌ను తీసేస్తే బ్యాట‌రీ బ్యాక‌ప్ పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఆటోమేటిక్ సింక్ ఆప్ష‌న్‌ను డిజేబుల్ చేయాలి. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడే ఆన్ చేయాలి. దీని వ‌ల్ల బ్యాట‌రీని ఆదా చేసుకోవ‌చ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో కేవ‌లం జీపీఎస్ మాత్ర‌మే కాదు, బ్లూటూత్‌, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ వంటి సెన్సార్లు ఏవి ఉన్నా ఆఫ్ చేయాలి. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడే ఆన్ చేసి వాడుకోవాలి. దీంతో చాలా వ‌ర‌కు బ్యాట‌రీ ప‌వ‌ర్ పెరుగుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లో Apps > Settings > Google Services > Search & Now > Voice > Click on ‘OK Google detection’ > Turn off ‘Always on అనే ఫీచ‌ర్‌ను ట‌ర్న్ ఆఫ్ చేస్తే బ్యాట‌రీ ఎక్కువ స‌మ‌యం పాటు వ‌స్తుంది. బ్యాక‌ప్ పెరుగుతుంది.

Tags: smart phone battery backup
Previous Post

“Film” మరియు “movie” ఇందులో ఏది కరెక్ట్ పదమో మీకు తెలుసా..?

Next Post

ఆదిత్య 369 అనగానే గుర్తుకువచ్చే 10 విషయాలు… ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అది.!

Related Posts

lifestyle

కొరియన్స్ అందరూ సన్న గా ఉంటారెందుకు? వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?

June 15, 2025
చిట్కాలు

మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

June 15, 2025
చిట్కాలు

పొడిగా ఉండే మీ చ‌ర్మం మృదువుగా మారాలంటే ఈ చిట్కాలను పాటించండి..

June 15, 2025
హెల్త్ టిప్స్

ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..!

June 15, 2025
business

ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి ముఖేష్ అంబానీ, ఎలాన్ మస్క్ ఎందుకు గట్టిగా పోట్లాడుతున్నారు..?

June 15, 2025
వినోదం

సినిమాల్లో ఆర్టిస్టులు వాడిన దుస్తులను ఏమి చేస్తారు?

June 15, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.