technology

మీ ఆండ్రాయిడ్ ఫోన్ స‌రిగ్గా ఆన్ అవ‌కున్నా, ప్యాట్ర‌న్ లాక్ మ‌రిచినా… ఇలా చేయండి చాలు..!

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు… వీటి గురించి ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే నేటి త‌రుణంలో ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ ఇవి ఉంటున్నాయి. నిత్యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ ప‌డుకునే వ‌ర‌కు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రు విహ‌రిస్తున్నారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, వాట్స‌ప్‌, సెల్ఫీ… ఇలా ప్ర‌తి నిమిషానికి ఫోన్‌ను ఓపెన్ చేయ‌డం, అవ‌స‌రం ఉన్నా లేకున్నా దాంట్లోకి చూడడం ఎక్కువైపోయింది. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా, ఆ ఫోన్ ప‌నిచేయ‌క‌పోతేనే ఇబ్బంది. ఎందుకు ప‌నిచేయ‌దంటారా..? అయితే ఇది చద‌వండి.

సాధార‌ణంగా ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను ఉప‌యోగించే ప్ర‌తి ఒక్క‌రికి అప్పుడ‌ప్పుడు కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. వాటిలో డివైస్ స్లోగా ప‌నిచేయ‌డం, అప్పుడ‌ప్పుడు హ్యాంగ్ అవ‌డం, స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోవ‌డం… ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే ఫోన్‌ను స్విచాఫ్ చేసి ఆన్ చేస్తే ఇలాంటి స‌మ‌స్య‌లు అప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్కార‌మ‌వుతాయి. కానీ డివైస్‌కు పెట్టిన ప్యాట్ర‌న్ లాక్ మ‌రిచిపోతే..? లేదంటే డివైస్ ఆన్ అయ్యే స‌మ‌యంలోనే అలాగే ఆగిపోతే..? అప్పుడు వాటిని ఎలా ప‌రిష్కరించుకుంటారు..? ఇలాంటి ప‌రిస్థితిలో ఎవ‌రైనా ఫోన్‌ను సంబంధిత కంపెనీ స‌ర్వీస్ సెంట‌ర్‌కో, సెల్ రిపేర్ చేసే వారి వ‌ద్ద‌కో తీసుకెళ్తారు. కానీ వారి వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌కుండానే మీకు మీరే ఈ స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా సాల్వ్ చేయ‌వ‌చ్చు. అదెలాగంటే…

how to reset android phone using reset menu

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను స్విచాఫ్ చేయాలి. ఫోన్ ను ఆన్ చేసి ఆ స‌మ‌యంలో వాల్యూమ్ డౌన్ బ‌ట‌న్‌, ప‌వర్ బ‌ట‌న్‌, హోమ్ కీ బ‌ట‌న్‌ల‌ను ఒకే సారి ప్రెస్ చేసి ఆన్ చేయాలి. ఇప్పుడు వ‌స్తున్న చాలా ఫోన్ల‌కు ఫిజిక‌ల్ హోమ్ కీ బ‌ట‌న్లు ఉండ‌డం లేదు. అలాంట‌ప్పుడు వాల్యూమ్ డౌన్ బ‌ట‌న్‌, ప‌వ‌ర్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తూ డివైస్‌ను ఆన్ చేస్తే స‌రిపోతుంది. అప్పుడు డివైస్ స్క్రీన్‌పై సిస్ట‌మ్ రిక‌వ‌రీ మెనూ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. అందులో wipe data / factory reset అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అయితే ఆ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలంటే వాల్యూమ్ అప్‌, డౌన్ బ‌ట‌న్ల‌ను ప్రెస్ చేయాలి.

ఎందుకంటే ఆ స్క్రీన్‌పై ట‌చ్ ప‌ని చేయ‌దు. కాబ‌ట్టి వాల్యూమ్ అప్‌, డౌన్ బ‌ట‌న్లతో ముందు చెప్పిన ఆప్ష‌న్‌కు వెళ్లి, సెలెక్ష‌న్ కోసం ప‌వ‌ర్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేయాలి. దీంతో మీరు ఎంచుకున్న ఆప్ష‌న్ సెలెక్ట్ అయి ఎస్ లేదా నో అని అడుగుతుంది. ఎస్ ఆప్ష‌న్‌ను ఎంచుకుని మళ్లీ ప‌వ‌ర్ బ‌ట‌న్‌ను ప్రెస్ చేస్తే డివైస్‌లోని డేటా అంతా క్లియ‌ర్ అయి, ఫోన్ రీసెట్ అవుతుంది. దీంతో పైన చెప్పిన ప్యాట్ర‌న్ లాక్ తొల‌గిపోతుంది. ఫోన్ స్టార్టింగ్ ప్రాబ్లం కూడా పోతుంది. తెలుసుకున్నారుగా, ఇక‌పై ఎప్పుడైనా మీ ఫోన్ ప్యాట్ర‌న్ లాక్ మ‌రిచిపోయినా, స‌రిగ్గా ఆన్ కాకున్నా ఈ మెథ‌డ్‌ను ఉప‌యోగించండి. దీంతో స‌మ‌స్య సుల‌భంగా ప‌రిష్కార‌మ‌వుతుంది.

Admin

Recent Posts