Dirisena Chettu : మనం ప్రతిరోజూ అనేక రకాల వృక్షాలను చూస్తూ ఉంటాం. ప్రతి చెట్టులోనూ ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసినప్పుడు మన ఆశ్చర్యపోతూ ఉంటాం. అలాంటి వృక్షాలలో దిరిసెన చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు మనకు ఎక్కడపడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. కానీ చెట్టు కూడా ఔషధ గుణాలును కలిగి ఉంటుందని, ఇది మనకు సంజీవినిలా పని చేస్తుందని మనలో చాలా మందికి తెలియదు. ఎన్నో రకాల వ్యాధులను తరిమికొట్టగల శక్తి దిరిసెన చెట్లకు ఉంటుంది. మనకు వచ్చే రక్త వికృత వ్యాధులన్నింటినీ ఈ చెట్టును ఉపయోగించి నయం చేసుకోవచ్చు. దీనిని సంస్కృతంలో శిరీష, మృదుపుష్ప అనీ, హిందీలో సిరీష్ అని పిలుస్తూ ఉంటారు.
దిరిసెన చెట్టు ఆకుల రసం, బెరడు రసం చేదు, కారం రుచులను కలిగి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మనకు వచ్చే విషరోగాలను, సుఖ రోగాలను, చర్మ రోగాలను, శ్వాస సంబంధమైన రోగాలను దిరిసెన చెట్టు హరించి వేస్తుంది. మనకు వచ్చే రోగాలను నయం చేసుకోవడానికి ఈ చెట్టును ఔషధంగా ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కంటిపోటుతో బాధపడేటప్పుడు దిరిసెన చెట్టు బెరడును నీటితో నూరి ఆ గంధాన్ని కంటి చుట్టూ కొద్ది దూరంలో లేపనంగా రాయడం వల్ల కంటిపోటు తగ్గుతుంది. కొంతమంది పిల్లల్లో దంతాలు రావు. అలాంటి పిల్లలకు దిరిసెన చెట్ల గింజలను దండగా గుచ్చి మెడలో వేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలు వస్తాయి. దంతాలు వచ్చిన వెంటనే దండను తీసేయాలి.
దిరిసెన చెట్టు గింజలను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. దీనిని రోజూ పరగడుపున 2 గ్రా. ల మోతాదులో ఒక కప్పు మంచి నీటితో కలిపి సేవిస్తూ ఉంటే రక్త మొలలు తగ్గుతాయి. రేచీకటిని తగ్గించే శక్తి కూడా దిరిసెన చెట్టుకు ఉంటుంది. 10 గ్రాముల దిరిసెన చెట్టు గింజల పొడిని బియ్యం పిండితో కలిపి రొట్టెగా చేసి ప్రతిరోజూ తింటూ ఉంటే క్రమంగా రేచీకటి తగ్గుతుంది. 100 గ్రా. ల దిరిసెన చెట్టు గింజలను బాగా ఆరబెట్టి మగ దూడ ఉన్న నాటు గేదె పాలలో వేసి 24 గంటల పాటు నానబెట్టి మెత్తగా నూరి దానిని కుంకుడు గింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను పురుషులు పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచి నీటితో కలిపి సేవిస్తూ ఉంటే వీర్య స్థంభన కలగడంతోపాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
ఈ చెట్టు వేరును కడిగి ఎండబెట్టి పొడిగా చేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదులో రోజూ పరగడుపున గోరు వెచ్చని నీటితో కలిపి 3 నెలల పాటుతీసుకోవడం వల్ల మూర్ఛ వ్యాధి తగ్గుతుంది. దిరిసెన చెట్టు గింజలను, వేప గింజలను, పత్తి గింజలను సమపాళ్లలో తీసుకుని వాటిని పగలకొట్టి లోపలి పప్పును మర్రిపాలతో నూరి శనగగింజల పరిమాణంలో మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రలను రోజూ ఒకటి చొప్పున పరగడపున తీసుకుంటూ ఉండడం వల్ల సెగ రోగాలు తగ్గుతాయి.
బహుళ పక్షమిలో వచ్చిన పంచమి తిథి నాడు దిరిసెన చెట్టుకు పూజ చేసి ఆ చెట్టు ఆకులు, బెరడు, గింజలు, వేరును సమపాళ్లలో తీసుకుని నీడలో ఎండబెట్టి పొడి చేసి వస్త్రంలో వేసి జల్లించగా వచ్చిన పొడికి మేక మూత్రం కలిపి బాగా దంచి ఆ మిశ్రమాన్ని శనగగింజల పరిమాణంలో మాత్రలుగా చేసి నీడలో ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. విష జంతువుల కాటు వేసినప్పుడు ఈ మాత్రలను నీటితో కలిపి అవసరాన్ని బట్టి మూడు పూటలా తీసుకోవడం వల్ల విషం హరించుకుపోతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.