Drum Stick Leaves : మన చుట్టూ పరిసరాల్లో పెరిగే అనేక రకాల చెట్లలో మునగ చెట్టు ఒకటి. మునగ కాయలను చాలా మంది కూరగా చేసుకుని తింటుంటారు. కొందరు పప్పు చారులో మునగకాయలను వేసి వండి తింటారు. ఆ చారు భలే రుచిగా కూడా ఉంటాయి. అయితే వాస్తవానికి మునగ ఆకులను సంజీవనిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆకులు ఏకంగా 300 కు పైగా వ్యాధులను తగ్గించగలవు. అవును.. ఆయుర్వేదంలో ఈ విషయాన్ని స్పష్టం చెప్పారు. అందుకనే మునగ ఆకులతో అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు.
1. మునగ ఆకుల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక క్యారెట్‌లో ఉండే విటమిన్ ఎ కన్నా 10 రెట్ల ఎక్కువ విటమిన్ ఎ ఒక కప్పు మునగ ఆకుల్లో ఉంటుంది. అందువల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు పోతాయి. రేచికటి, దృష్టి సమస్యలు ఉన్నవారు మునగ ఆకులను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. చూపు స్పష్టంగా ఉంటుంది. కంటి సమస్యలు పోతాయి.
2. పాలలో కాల్షియం అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఒక గ్లాస్ పాలలో ఉండే కాల్షియం కన్నా ఒక కప్పు మునగ ఆకుల్లో 17 రెట్ల కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మునగ ఆకులను తీసుకుంటే ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. వాపులు, నొప్పులు తగ్గుతాయి.
3. ఒక అరటి పండులో ఉంటే పొటాషియం కన్నా 15 రెట్ల ఎక్కువ పొటాషియం ఒక కప్పు మునగాకుల్లో ఉంటుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా నిరోధించవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
4. ఒక కప్పు పెరుగులో ఉండే ప్రోటీన్ల కన్నా 8 రెట్ల ఎక్కువ ప్రోటీన్లు ఒక కప్పు మునగాకుల్లో ఉంటాయి. కనుక మునగాకులను తరచూ తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది. కండరాలకు బలం లభిస్తుంది. రోజూ నీరసంగా, నిస్సత్తువగా ఉండేవారు మునగాకులను ఏదో ఒక రూపంలో తీసుకుంటే శక్తి లభించి చురుగ్గా ఉంటారు. ఎంత పనిచేసినా అలసిపోరు.
5. షుగర్ ఉన్నవారికి మునగాకులు ఎంతో మేలు చేస్తాయి. రోజూ 7 గ్రాముల మునగాకుల పొడిని 3 నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయని, మధుమేహం అదుపులోకి వస్తుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మునగాకుల్లో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో డయాబెటిస్ నుంచి విముక్తి పొందవచ్చు.
6. మునగాకులను లేదా పొడిని రోజూ తీసుకోవడం వల్ల 13 రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. దీంతోపాటు శరీరంలో క్యాన్సర్ కణతులు పెరగకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.
7. మునగాకులను తీసుకుంటే థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. రోజూ మునగాకులను తీసుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథులు సరిగ్గా పనిచేస్తాయి. దీంతో ఒళ్లు నొప్పులు, కాలి పిక్కలు పట్టేయడం, బద్దకం, జుట్టు రాలిపోవడం వంటి ఇతర లక్షణాలు కూడా తగ్గుతాయి.
8. మునగాకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత నుంచి బయట పడేస్తుంది. రక్తం బాగా తయారవుతుంది.
9. మునగాకుల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
10. మునగాకులను నేరుగా తీసుకోలేకపోతే వాటిని పేస్ట్‌లా చేసి కట్టు కట్టవచ్చు. దీంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే చర్మ సమస్యలు తగ్గుతాయి.
11. మునగాకులను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
12. మునగాకుల వల్ల జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. మలబద్దకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఇంకా మునగాకుల వల్ల ఎన్నో విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. మునగాకులను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకోవచ్చు. కూర వండి లేదా ఒక కప్పు జ్యూస్ రూపంలో ఉదయాన్నే పరగడుపునే తాగవచ్చు. లేదా ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసి దాన్ని రోజూ 2 టీస్పూన్ల మోతాదులో వేడి నీటిలో కలిపి రాత్రి పూట తీసుకోవచ్చు. దీంతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు.