Gandaki Patram : మ‌న చుట్టూ ప్ర‌కృతిలో పెరిగే చెట్టు ఇది.. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా..?

Gandaki Patram : గండ‌కి ప‌త్రం మొక్క.. ఈ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. ఎక్కువ‌గా రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో పెరుగుతుంది. ఇది పూల మొక్క క‌నుక పార్కుల వ‌ద్ద ఎక్కువ‌గా పెంచుతూ ఉంటారు. ఈ మొక్క ఆకులు చూడ‌డానికి ఒంటె పాదాల వ‌లె ఉంటాయి క‌నుక దీనిని క్యామెల్ ఫూట్ ట్రీ అని కూడా అంటారు. అలాగే క‌చ్నార్ అని కూడా పిలుస్తారు. అయితే అంద‌రూ దీనిని ఒక సాధార‌ణ పూల మొక్క‌లాగా భావిస్తారు కానీ ఈ మొక్క ఔష‌ధ మొక్క అని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. గండకి పత్రం మొక్క‌లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. గండ‌కి ప‌త్రం మొక్క వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గండ‌కి ప‌త్రం మొక్క ఆకుల‌ను, బెర‌డును ఉప‌యోగించ‌డం వ‌ల్ల రక్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. స‌హ‌జ సిద్దంగా షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచ‌డంలో ఈ చెట్టు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే ఈ చెట్టు ఆకుల‌కు శ‌రీరంలో ఇన్ ప్లామేష‌న్ ను త‌గ్గించే గుణం కూడా ఉంది. ఈ ఆకుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఆస్థ‌మా, ఆర్థ‌రైటిస్ వంటి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అలాగే ఈ గండ‌కీ ప‌త్రం చెట్టు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ ను న‌శింప‌జేసి శ‌రీరాన్ని క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులు వంటి స‌మ‌స్యల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఈ చెట్టు ఆకుల‌ను, బెర‌డును ఉపయోగించ‌డం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెరుగుప‌డుతుంది.

Gandaki Patram tree benefits in telugu
Gandaki Patram

హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ చెట్టు ఆకుల‌ను, బెర‌డును ఉప‌యోగించ‌డం వ‌ల్ల థైరాయిడ్ అదుపులో ఉంటుంది. అలాగే గండ‌కి ప‌త్రం ఆకుల‌ను పేస్ట్ గా చేసి రాయ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి. అలాగే ఈ చెట్టు యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాల‌ను కూడా క‌లిగి ఉంది. క‌నుక దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ఈ చెట్టు బెరడును ఉప‌యోగించ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మ‌న‌కు ఆయుర్వేద షాపుల్లో ఈ గండ‌కి ప‌త్రం మొక్క యొక్క చూర్ణం, జ్యూస్ లు ల‌భిస్తూ ఉంటాయి. ఈ చూర్ణాన్ని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తీసుకోవాలి. అలాగే ఈ జ్యూస్ ను 20 ఎమ్ ఎల్ మోతాదులో రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఈ విధంగా గండ‌కి ప‌త్రం మొక్క‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts