Nalla Thumma Chettu : ఔషధ గుణాలు కలిగిన అనేక రకాల చెట్లలో నల్ల తుమ్మ చెట్టు కూడా ఒకటి. దీనిని సంస్కృతంలో అర్బూరా అని, హిందీలో అబుర్ అని పిలుస్తుంటారు. తుమ్మ చెట్లల్లో నల్ల తుమ్మ, తెల్ల తుమ్మ, కస్తూరి తుమ్మ అనే రకాలు ఉన్నాయి. నల్ల తుమ్మ పువ్వులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. తెల్ల తుమ్మ పువ్వులు తెల్లగా ఉంటాయి. కస్తూరి తుమ్మ దాదాపు తెల్ల తుమ్మ లాగే ఉండి పొట్టిగా ఉంటుంది. నల్ల తుమ్మ చెట్టు ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది వగరు, కారం రుచులను కలిగి ఉంటుంది. నల్ల తుమ్మ చెట్టును ఉపయోగించి మనకు వచ్చే వాత, కఫ, పిత్త సంబంధిత అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
స్త్రీ, పురుషులిద్దరిలోనూ సంభోగ సామర్థ్యాన్ని పెంచే శక్తి నల్ల తుమ్మ చెట్టుకు ఉంది. దీనిని ఉపయోగించి మనం తల వెంట్రుకలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. మనకు వచ్చే చర్మ వ్యాధులను నయం చేసే అద్భుత శక్తి ఈ చెట్టులో ఉంది. నల్ల తుమ్మ చెట్టు నుండి వచ్చే జిగురు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టు కాండానికి గాటు పెడితే ఆ గాటు నుండి జిగురు వస్తుంది. ఈ జిగురును 2 గ్రా., ల చొప్పున తీసుకోవడం వల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుకుంటాయి. ఈ జిగురును పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల గాయాల నుండి రక్తం కారడం ఆగుతుంది. తుమ్మ కాయలు తియ్యగా ఉండి చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. తుమ్మ కాయలను వాడడం వల్ల పురుషులల్లో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.

తుమ్మ ఆకులను నూరి పురుషాంగం మీద లేపనంగా రాయడం వల్ల సవాయి పుండ్లు త్వరగా మానిపోతాయి. లేత తుమ్మ ఆకులను నూరి నీటిలో కలిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉండడం వల్ల అతిసారం వ్యాధి తగ్గుతుంది. తుమ్మ చెట్టు బెరడును తెచ్చి నీటిలో వేసి మరిగించి చిక్కటి కషాయాన్ని తయారు చేయాలి. ఈ కషాయానికి మజ్జిగను కలిపి తాగడం వల్ల కడుపులో ఉండే చెడు నీరు అంతా తొలిగిపోతుంది.
తుమ్మ జిగురు చూర్ణాన్ని కానీ, తుమ్మ బెరడు చూర్ణాన్ని కానీ తీసుకుని పూటకు రెండున్నర టీ స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుకుంటాయి. నల్ల తుమ్మ చెట్టు లేత ఆకులను మెత్తగా నూరి నీటిలో వేసి చిన్న మంటపై చిక్కని కషాయం అయ్యే వరకు మరిగించాలి. ఈ కషాయానికి తేనెను కలిపి కళ్లకు కాటుకలా రాసుకోవడం వల్ల కళ్ల నుండి నీరు కారడం తగ్గుతుంది.
రెండు నల్ల తుమ్మ కాయలను కచ్చా పచ్చాగా దంచి ఒక గ్లాస్ పాలలో వేసి కాచి వడకట్టి తగినంత పంచదార కలుపుకుని తాగుతూ ఉంటే పురుషులల్లో వీర్య స్థంభన కలిగి ఎక్కువగ సేపు సంభోగం చేసే సామర్థ్యం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నల్ల తుమ్మ చెట్టు బెరడు కషాయంలో పటిక బెల్లాన్ని కలిపి కషాయం గోరు వెచ్చగా ఉన్నప్పుడే నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా చేయడం వల్ల నోటి పూత, చిగుర్ల సమస్యలు, దంతాల సమస్యలు తగ్గుతాయి.
రక్త పింజర పాము కాటు వేసినప్పుడు నోటి వెంట, మూత్రం వెంట రక్తం పోతూ ఉంటుంది. అలాంటప్పుడు తుమ్మ బెరడు కషాయాన్ని తీవ్రతను బట్టి పాము కాటు వేసిన వ్యక్తికి తాగిస్తూ ఉంటే రక్తం పోవడం తగ్గుతుంది. నల్ల తుమ్మ చెట్టు బెరడును మెత్తగా నూరి లేపనంగా రాయడం వల్ల వ్రణాలు తగ్గుతాయి. ఈ విధంగా నల్ల తుమ్మ చెట్టును ఉపయోగించడం వల్ల ఎటువంటి ఖర్చు లేకుండానే మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.