Pakshavatham : ప్రస్తుత కాలంలో పక్షవాతం బారిన పడేవారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఈ పక్షవాతం బారిన పడడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ఒక్కసారి పక్షవాతం బారిన పడితే చాలా కాలం వరకు మంచానికే పరిమితం కావాల్సి వస్తోంది. పక్షవాతానికి గురి కావడం వల్ల కాళ్లు, చేతులలో చలనం లేకుండా పోతుంది. వారి పనులను కూడా వారు చేసుకోలేకపోతారు. ఆయుర్వేదం ద్వారా మనం పక్షవాతం వల్ల చలనం కోల్పోయిన శరీర భాగాలలో మరలా చలనాన్ని తీసుకు రావచ్చు.
ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు ఔషధంగా ఉపయోగించే కసివింద చెట్టును వాడి మనం చలనం కోల్పోయిన శరీర భాగాలలో మరలా చలనాన్ని తీసుకురావచ్చు. కసివింద చెట్టు మనకు విరివిరిగా కనిపిస్తూనే ఉంటుంది. వర్షాకాలంలో ఈ చెట్టు మనకు ఎక్కువగా కనిపిస్తుంది. మేకలు ఈ చెట్టును ఎంతో ఇష్టంగా తింటాయి. కసివింద చెట్టు కాయలు సన్నగా , పొడుగ్గా ఉంటాయి. పూర్వకాలంలో ఈ చెట్టు కాయలను మంటపై వేయించి లోపలి గింజలను తినే వారు.
పక్షవాతాన్ని తగ్గించడంలో కసివింద చెట్టు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా ముదిరిన కసివింద చెట్టు ఆకులను సేకరించి వాటికి వెన్నను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని పక్షవాతం వల్ల దెబ్బతిన్న శరీర భాగాలపై లేపనంగా రాసి మర్దనా చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి చలనం కోల్పోయిన శరీర భాగాలలో తిరిగి చలనం వస్తుంది. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల పక్షవాతం పూర్తిగా నయం అవుతుంది. ఈ విధంగా కసివింద చెట్టును ఉపయోగించి మనం పక్షవాతం నుండి బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.