మీ ఇంట్లో బొప్పాయి చెట్టును పెంచుకోండి.. ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే చెట్టును వెంట‌నే పెంచుతారు..!

దాదాపుగా చాలా మంది ఇండ్ల‌లో బొప్పాయి చెట్లు ఉంటాయి. ఇవి త‌క్కువ ఎత్తు ఉన్న‌ప్ప‌టి నుంచే కాయ‌లు కాస్తాయి. అయితే ప్ర‌తి ఇంట్లోనూ బొప్పాయి చెట్టు క‌చ్చితంగా ఉండాలి. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలిస్తే బొప్పాయి చెట్టును వెంట‌నే పెంచుతారు. అవేమిటంటే..

మీ ఇంట్లో బొప్పాయి చెట్టును పెంచుకోండి.. ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే చెట్టును వెంట‌నే పెంచుతారు..!

* బొప్పాయి పువ్వును తీసుకుని దంచి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని పేను కొరికిన చోట రాయాలి. దీంతో అక్క‌డ వెంట్రుక‌లు పెరుగుతాయి.

* బొప్పాయి చెట్టు కాండానికి చిన్న‌గా గాటు పెడితే పాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. వాటిని చ‌ర్మంపై రాస్తుంటే చ‌ర్మ స‌మ‌స్య‌లైన గ‌జ్జి, తామ‌ర త‌గ్గుతాయి.

* బొప్పాయి పాల‌ను 10 చుక్క‌ల మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా చ‌క్కెర క‌లిపి 3 పూట‌లా తీసుకుంటుండాలి. గ్యాస్, అసిడిటీ, ఇత‌ర స‌మ‌స్య‌లు, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి.

* బొప్పాయి పాల‌ను రోజూ ఒక సారి ఒక టీస్పూన్ మోతాదులో తాగుతుండాలి. దీంతో లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. లివ‌ర్ శుభ్రంగా మారుతుంది.

* బొప్పాయి ప‌చ్చికాయ‌కు గాటు పెడితే దాంట్లో నుంచి పాలు వ‌స్తాయి. వాటిని ఒక పాత్ర‌లో సేక‌రించి ఆ పాత్ర‌ను బాగా కాల్చిన ఇసుక‌పై ఉంచాలి. దీంతో ఆ పాలు తెల్ల‌ని చూర్ణంలా మారుతాయి. ఈ చూర్ణాన్ని రోజుకు 2 సార్లు చిటికెడు మోతాదులో చ‌క్కెర లేదా పాల‌తో తింటే అమిత‌మైన జీర్ణ‌శక్తి క‌లుగుతుంది.

* తేలు కుట్టిన చోట బొప్పాయి కాండం పాలు రాస్తే తేలు విషం హ‌రించుకుపోతుంది.

* బాలింత‌లు బొప్పాయి ప‌చ్చికాయ‌ను వండుకుని తింటుంటే వారిలో పాలు బాగా ప‌డ‌తాయి.

* బొప్పాయి ఆకును బాగా నూరి పేస్ట్‌లా చేసి క‌డితే బోద‌కాలు త‌గ్గిపోతుంది.

* ఉడుకుతున్న మాంసంలో బొప్పాయి కాయ ముక్క‌ల‌ను వేస్తే ఆ మాంసం త్వ‌ర‌గా ఉడ‌క‌డ‌మే కాదు, బాగా మెత్త‌గా కూడా మారుతుంది.

Admin

Recent Posts