వాస్తు ప్రకారం అనుసరించడం వలన, మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు. ఆర్థిక బాధలు మొదలు, అనేక సమస్యలకి పరిష్కారం వాస్తు తో దొరుకుతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే, చాలా ఇబ్బందులు నుండి గట్టెక్కచ్చు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే, ఖచ్చితంగా ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇలా కనుక మీరు చేసినట్లయితే, చక్కటి ఫలితం ఉంటుంది.
ఇంటి ముఖద్వారం ఎప్పుడూ కూడా, తూర్పు వైపు ఉండాలి. లేదంటే, ఉత్తర, ఈశాన్యం వైపు ఉంటే మంచిది. ఈ దిశలో ముఖద్వారం ఉంటే, చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆర్థిక సమస్యలు మొదలు అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇంటి ముఖద్వారం దగ్గర ఎప్పుడూ కూడా షూ స్టాండ్ వంటివి పెట్టకూడదు.
ఇంటి ముఖద్వారం ఎదురుగా చెప్పులు, షూ వంటివి విడవకూడదు. ఎప్పుడూ కూడా పడమర లేదంటే దక్షిణం వైపు ఫర్నిచర్ ని ఎక్కువగా పెట్టకూడదు. అలానే, ఆగ్నేయం వైపు మాత్రమే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ని పెట్టాలి. మీరు అద్దాన్ని పెట్టుకోవాలంటే, ఉత్తరం వైపు పెట్టుకోవడం మంచిది. లివింగ్ రూమ్ లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే, మంచి పెయింటింగ్స్ ని పెట్టుకోవడం మంచిది.
అదేవిధంగా బెడ్రూంలో మంచి సహజమైన వెల్తురు వచ్చేటట్టు చూసుకోవాలి. ఎప్పుడూ కూడా కిటికీలని తెరిచి పెట్టుకోవడం మంచిది. మంచానికి పక్కనే అద్దాలు పెట్టుకోకూడదు. దాని వలన మంచి ఎనర్జీ రాదు. అలానే బర్నర్లు, మైక్రోవేవ్, టోస్టర్, సిలిండర్లు ఇటువంటి వాటిని మీరు ఎప్పుడూ కూడా ఆగ్నేయం వైపు పెట్టుకోవడం మంచిది. ఇలా, ఈ మార్పులు ని మీరు చేసినట్లయితే మంచి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉండవచ్చు.