vastu tips For Home వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. కొన్ని నెగెటివ్ ఎనర్జీని పెంచుతాయి. అయితే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నా, ధనం సంపాదించాలన్నా, ఏ పని చేసినా విజయవంతం అవ్వాలన్నా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. దీంతో అంతా శుభమే కలుగుతుంది. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అందుకు గాను ఈ వాస్తు సూచనలు పాటించాలి.
1. పగిలిపోయిన విగ్రహాలను ఇంట్లో vastu tips For Home పెట్టుకుంటే వాస్తు ప్రకారం అంత మంచిది కాదు. కనుక వాటిని తీసేయాలి. లేదంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది అశుభాలను కలిగిస్తుంది. ఇంట్లోని వారికి దురదృష్టాన్ని తెచ్చి పెడుతుంది.
2. సంపదలను అందించే లక్ష్మీ దేవికి పరిశుభ్రత అంటే ఇష్టం. కనుక ఇంటిని, vastu tips For Home ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి. చెత్త, వ్యర్థాలతో ఉంచితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లు అవుతుంది. కాబట్టి శుభ్రతను పాటించాలి.
3. ఇంట్లో చీకటిగా vastu tips For Home ఉందంటే నెగెటివ్ ఎనర్జీని ఆహ్వానించినట్లే అవుతుంది. కనుక సాయంత్రం అవగానే ఇంట్లోని దీపాలను వెలిగించాలి. నిద్రించేటప్పుడు దీపాలను ఆర్పేయవచ్చు. కానీ మెళకువతో ఉన్నంత వరకు దీపాలను వెలిగించాలి. దీంతో నెగెటివ్ ఎనర్జీ పోతుంది.
4. మందులకు సంబంధించిన వ్యర్థాలను ఇంట్లో పెట్టుకోరాదు. పెడితే ఇంట్లోని వారి ఆరోగ్యం బాగుండదు. వ్యాధులు వస్తాయి. కాబట్టి ఆ వ్యర్థాలను పడేయాలి.
5. మునిగిపోతున్న పడవలు, యుద్ధం, నెగెటివ్ ఆలోచనలు, టెన్షన్ పెట్టించే ఫొటోలను, పెయింటింగ్స్‌ను, విగ్రహాలను ఇంట్లో పెట్టుకోరాదు. పెడితే అన్నీ సమస్యలే వస్తాయి.