South West Vastu : ప్రతి ఒక్కరు కూడా, వాస్తు పండితులు చెప్పిన వాస్తు చిట్కాలని పాటిస్తూ ఉంటారు. మనం వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన, ఏ ఇబ్బంది ఉండదు. సంతోషంగా ఉండవచ్చు. సమస్యలన్నిటికీ దూరంగా ఉండవచ్చు. ఈరోజు పండితులు చెప్పిన, కొన్ని వాస్తు చిట్కాలు గురించి చూద్దాం. ఇలా కనుక మనం పాటించినట్లయితే, ఎంతో మంచి జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో నైరుతి మూలలో ఎటువంటి వస్తువులు ఉంచాలి..?, ఎటువంటి వస్తువుల్ని ఉంచకూడదు అనేది చూద్దాం. ఇంట్లో గొడవలు రాకుండా అనుకున్న పనులు పూర్తవ్వాలంటే, ఎలాంటి వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిదనేది చూద్దాం.
నైరుతి మూలకి సంబంధించి చిట్కాలు చాలా ముఖ్యమైనవి. నైరుతి మూలలో బరువులు పెట్టడం మంచిది కాదు. అలానే, నైరుతివైపు శుభ్రత కూడా ముఖ్యం. ఎప్పుడూ కూడా, బాగా సర్దుకుని అన్ని పెట్టుకోవాలి. అలానే, నైరుతి మూలలో వాటర్ ఫౌంటెన్, ఫిష్ ట్యాంకులు వంటివి పెట్టకూడదు. నీటికి సంబంధించిన ఏ వస్తువుల్ని కూడా నైరుతి మూల పెట్టకండి. నీరు భావోద్వేగాల మూలకాన్ని సూచిస్తుంది. నైరుతి మూలలో నీటిని పెట్టడం వలన, మానసిక గందరగోళం వస్తుంది.
అలానే, నైరుతి మూలలో వంటగది కూడా ఉండకూడదు అని వాస్తు శాస్త్రం లో చెప్పబడింది. నైరుతి మూలలో వంటగది ఉంటే, దంపతులు మధ్య కలహాలు వస్తాయి. మానసిక ప్రశాంతత కూడా పోతుంది. నైరుతి మూలలో వంటగది ఉండాల్సి వస్తే, ప్రతికూల శక్తిని పోగొట్టడానికి, రాహు యంత్రాన్ని పెట్టాలి.
నైరుతి వైపు బెడ్ రూమ్ ఉండడం కూడా మంచిది కాదు. నైరుతి దిశలో పడకగది ఉంటే, దంపతులు మధ్య సఖ్యత ఉండదు. తరచు గొడవలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి, ఈ పొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలి. నైరుతి మూలలో గాలి, వెల్తురు బాగా వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే, నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇలా ఇక్కడ చెప్పిన వాటిని పాటిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇబ్బందులు నుండి గట్టెక్కొచ్చు.