vastu

Sleep : ఉత్తరం వైపు తల పెట్టి ఎందుకు నిద్రపోకూడదు..? దీని వెనుక ఇంత కథ ఉందని తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sleep &colon; మనం నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి&period; నియమాల‌ను అనుసరించి మనం నిద్రపోతే చక్కటి ఫలితం కనబడుతుంది&period; అయితే ఎప్పుడైనా మీరు పండితులు చెప్పడాన్ని వినే ఉంటారు&period; ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు అని&period; అయితే అసలు ఎందుకు ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్రపోకూడదు&period;&period;&quest;&comma; దాని వెనుక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం&period; ఉత్తరం వైపుగా తల పెట్టుకుని నిద్రపోవడం వలన చెడు కలలు వస్తాయని&comma; మనసుని దెబ్బతీసేలా ఉంటాయ‌ని అంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉత్తరం వైపు నిద్రపోతే పాజిటివ్ ఎనర్జీని కోల్పోతారు కూడా&period; పూర్వీకుల‌ నుండి కూడా ఇలా చెప్పడం జరుగుతోంది&period; అయితే ఉత్తరం వైపు తల పెట్టుకుని ఎందుకు నిద్రపోకూడదు అనే విషయానికి వచ్చేస్తే&period;&period; ఉత్తరం వైపు తల పెట్టుకుని నిద్ర పోవడం వలన సైంటిఫిక్ పరంగా చూసుకున్నట్లయితే&comma; రక్తప్రసరణకి ఆటంకం అవుతుంది&period; నిద్రలో ఆటకం ఏర్పడుతుంది&period; కాబట్టి అలా నిద్రపోకూడదని అంటారు&period; ఎనర్జీ లెవెల్స్ కూడా ఉత్తరం వైపు నిద్రపోవడం వల్ల తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52769 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;sleep-5&period;jpg" alt&equals;"this is why we should not sleep in north direction " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధ్యాత్మికపరంగా చూసుకున్నట్లయితే పార్వతీ దేవి స్నానానికి వెళ్ళినప్పుడు గణపతిని తలుపు దగ్గర కాపలాగా పెడుతుంది&period; ఎవరినీ లోపలికి రాకుండా చూసుకోమని చెప్తుంది&period; వినాయకుడికి శివుడు పార్వతీ దేవి భర్త అని తెలిసినా శివుడిని లోపలికి వెళ్ళకుండా వినాయకుడు అడ్డుకుంటాడు&period; పార్వతీ దేవి బయటకి వచ్చేసరికి శివుడు&comma; గణపతి గొడవ పడుతూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివుడికి కోపం వచ్చి వినాయకుడి తల నరికేస్తాడు&period; పార్వతీ దేవి ఆగ్రహానికి లోనై తన బిడ్డను తిరిగి కాపాడాలని మొండిపట్టు పడుతుంది&period; శివుడు ఆదేశించ‌గా అతని భటులు ఉత్తరం దిశగా నిద్రిస్తున్న జీవుల కోసం వెతుకుతూ ఉంటారు&period; అప్పుడు ఒక ఏనుగుని చూస్తారు&period; ఆ ఏనుగు తల నరికి శివుడికి ఇస్తారు&period; ఇలా ఉత్తరం వైపు పడుకున్న వాళ్ళ తలని తీసుకున్నారని&comma; ఇలా ఈ దిశలో పడుకోకూడదని చెప్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts