Samsung Galaxy A03 : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్.. కొత్తగా గెలాక్సీ ఎ03 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో అనేక ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో 6.5 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ యూనిసోక్ టి606 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లలో ఈ ఫోన్ విడుదలైంది. ఇందులో మెమొరీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. డ్యుయల్ సిమ్‌లను, ఒక మెమొరీ కార్డును వేసుకోవచ్చు. హైబ్రిడ్ స్లాట్ కాదు. వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎ03 స్మార్ట్ ఫోన్ కు చెందిన 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,499 ఉండగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,999గా ఉంది. ఈ ఫోన్‌ను అన్ని రిటెయిల్ స్టోర్స్ తో పాటు శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లోనూ విక్రయిస్తున్నారు.