Hemoglobin : ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకకరమైన రక్తం అవసరం. మన శరీరరంలో తగినంత హిమోగ్లోబిన్ లేకపోతే అది రక్తహీనతకు దారి తీస్తుంది. మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారవడానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ హిమోగ్లోబిన్ ను తయారు చేయడమే కాకుండా ఎర్ర రక్తకణాల తయారీకి ఉపయోగపడుతుంది. కింద తెలిపిన పండ్లను తినడం వలన మనం రక్తహీనత నుండి బయట పడవచ్చు. ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.
1. ఎండబెట్టిన టమాటాలలో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మనం తిన్న ఆహార పదార్థాల నుండి ఐరన్‌ను మన శరీరం సంగ్రహించడంలో విటమిన్ సి ఎంతో సహాయ పడుతుంది. ఎండబెట్టిన టమాటాలు మనకు మార్కెట్లో లభిస్తాయి. వీటిని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన మనకు ఎంతో మేలు చేకూరుతుంది.
2. ఐరన్ ఎక్కువగా లభించే వాటిల్లో ఎండు ద్రాక్ష ఒకటి. మనం తినే ఆహార పదార్థాలలో ఎండు ద్రాక్షలను భాగంగా చేసుకోవడం వలన ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. కనుక వాటిని తినడం వలన ఎంతో మేలు చేకూరుతుంది. ఐరన్ లభించడంతోపాటు హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
3. ఆప్రికాట్ లలో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక మలబద్దకం సమస్య రాదు. వీటిని నేరుగా తినవచ్చు. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
4. ఐరన్ అధికంగా లభించే బెర్రి పండ్లల్లో మల్‌బెర్రి ఒకటి. వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలని పెంచుతాయి.
5. ఖర్జూరాలలో ఐరన్ అధికంగా ఉంటుంది. రోజూ రెండు ఖర్జూరాలు తినడం వలన మనలో రక్తహీనత ఉండదు. వీటిని తీపి పదార్థాలలో చక్కెరకు బదులుగా వాడవచ్చు.
6. దానిమ్మ పండ్లల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. మన శరీరం ఐరన్‌ను శోషించడంలో విటమిన్ సి సహాయపడుతుంది. దానిమ్మ పండ్లను నేరుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
7. పుచ్చకాయలను తినడం వలన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. విటమిన్ సి, ఐరన్ పుచ్చకాయలలో అధికంగా ఉంటాయి. అందువల్ల రక్తం కూడా పెరుగుతుంది.