Colon Clean : రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలు శరీరంలో జీర్ణం అవుతాయి. వాటిని లివర్ జీర్ణం చేస్తుంది. తరువాత వాటిల్లో ఉండే పోషకాలను గ్రహిస్తుంది. ఈ క్రమంలో వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. అవి చిన్న పేగుల నుంచి పెద్దపేగు వరకు వెళ్లి అక్కడి నుంచి బయటకు వస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. అయితే ఇందులో ఎక్కడ చిన్న తేడా వచ్చినా మొత్తం ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో వ్యర్థాలు అంత సులభంగా బయటకు పోవు. ఫలితంగా శరీరంలో విష పదార్థాలు పేరుకుపోతాయి. కనుక వ్యర్థాలు సరిగ్గా బయటకు పోకుండా సమస్యలు పడుతున్నవారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే అనారోగ్యాలను కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది.
పేగుల్లో వ్యర్థాలు పేరుకుపోతే శరీరం విషతుల్యం అవుతుంది. కనుక రోజూ విరేచనం సరిగ్గా అవని వారు, మలబద్దకం సమస్య ఉన్నవారు.. జీర్ణాశయం, పేగుల సమస్యలతో బాధపడుతున్నవారు.. జీర్ణవ్యవస్థను శుభ్రం చేసుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన చిట్కాను పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే..
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల హిమాలయన్ సాల్ట్, ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఉప్పు నీటిలో పూర్తిగా కరిగేవరకు బాగా తిప్పాలి. అనంతరం ఆ నీటిని గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి. పరగడుపున ఈ మిశ్రమాన్ని తాగిన తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోకూడదు. దీంతో జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది.
రోజూ ఇలా పరగడుపునే ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల జీర్ణాశయం, పేగులు అన్నీ శుభ్రంగా మారుతాయి. కడిగేసినట్లు క్లీన్ అవుతాయి. వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో మలబద్దకం, ఇతర జీర్ణ సమస్యలు ఉండవు. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. ఈ చిట్కాను రోజూ పాటిస్తే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.