ఒకప్పుడంటే చాలా మంది ఇంటర్నెట్‌ను కేవలం కంప్యూటర్లలో మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడలా కాదు, ప్రతి ఫోన్‌లోనూ ఇంటర్నెట్ లభిస్తోంది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను ఇప్పుడు యూజర్లు వాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ఇంటర్నెట్ ద్వారా వారు తమకు అవసరం ఉన్నో ఎన్నో వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి వెబ్‌సైట్లను ఓపెన్ చేసేటప్పుడు 401, 403, 404, 500 అనే నంబర్ల పేరిట ఎర్రర్ మెసేజ్‌లు వస్తుంటాయి. ఈ క్రమంలో అసలు ఈ నంబర్లు ఎందుకు వస్తాయి..? వాటిని బట్టి మనం ఏ అర్థం చేసుకోవచ్చు, వాటి వల్ల మనకు ఏం తెలుస్తుందో ఇప్పుడు చూద్దాం.
HTTP Error 401 Unauthorized.. ఈ ఎర్రర్ గనక వచ్చినట్టయితే ఆ సైట్‌కు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఉంటాయని అర్థం. వాటిని కరెక్ట్‌గా ఎంటర్ చేస్తే ఈ ఎర్రర్ రాకుండా ఉంటుంది. లేదంటే ఇలాంటి ఎర్రర్ మెసేజ్‌లు వస్తాయి. యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను కరెక్ట్ ఇస్తే ఇలాంటి ఎర్రర్‌లు రావు. HTTP status 403 Forbidden.. ఈ ఎర్రర్ మెసేజ్‌కు అర్థం ఏమిటంటే… సదరు వెబ్‌సైట్‌ను సందర్శించేందుకు యూజర్‌కు పర్మిషన్ లేదు అని అర్థం. అంటే సర్వర్ లో ఉన్న సెక్యూర్డ్ ఫోల్డర్‌ను ఎవరైనా ఓపెన్ చేయాలని చూస్తే ఇలాంటి ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సదరు ఫోల్డర్‌ను రక్షణగా ఉంచడం కోసమే ఇలాంటి మెసేజ్‌లు వస్తాయి.
HTTP status 404 Not Found.. ఈ ఎర్రర్ మెసేజ్ వల్ల మనకు ఏం తెలుస్తుందంటే… యూజర్ కావాలని చూస్తున్న ఆ సైట్ సర్వర్‌లో లేదని అర్థం. అంటే ఆ సైట్‌కు చెందిన ఫోల్డర్లు, ఫైల్స్ ఏవీ సర్వర్‌లో లేకపోతే అప్పుడు ఆ సైట్‌ను ఎవరైనా ఓపెన్ చేస్తే ఇలాంటి మెసేజ్ వస్తుంది. HTTP status 500 Internal Server Error.. ఇది సర్వర్ సైడ్ ఎర్రర్ మెసేజ్. ఇది ఎందుకు వస్తుందంటే… సర్వర్‌లో ఉన్న .htaccess లేదా PHP ఫైల్స్, డేటాబేస్‌లు, ఫోల్డర్లు పొరపాటుగా సేవ్ అయితే ఈ మెసేజ్ వస్తుంది. అంటే ఆ వెబ్‌సైట్ కాన్ఫిగరేషన్ సరిగ్గా లేదని అర్థం. HTTP status 503 Service unavailable.. ఇది కూడా సర్వర్ సైడ్ ఎర్రర్ మెసేజే. ఇది ఎందుకు వస్తుందంటే సర్వర్‌పై ఓవర్ లోడ్ పడినప్పుడు సర్వర్ తాత్కాలికంగా పనిచేయడం మానేస్తుంది. దీంతో అలాంటి స్థితిలో సైట్‌ను ఓపెన్ చేస్తే ఈ మెసేజ్ వస్తుంది. వెబ్‌సైట్ రన్ చేస్తున్న వారు హోస్టింగ్ అకౌంట్‌కు వెళ్లి PHP సెట్టింగ్స్‌లో వివరాలను సరి చేస్తే చాలు. ఈ ఎర్రర్ మెసేజ్‌లు రావు.