5g Smart Phones : ప్రస్తుత తరుణంలో అనేక మొబైల్ తయారీ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందిస్తున్నాయి. తక్కువ ధరలకే ఆకట్టుకునే ఫీచర్లతో ఫోన్లను రూపొందిస్తూ వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఇప్పుడంతా 5జి టెక్నాలజీ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో 5జి ఫోన్లను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. కానీ ఏ ఫోన్‌ను కొనాలో, తక్కువ ధరకు ఏ ఫోన్ లభిస్తుందో చాలా మందికి తెలియడం లేదు. అలాంటి వారు కింద ఇచ్చిన ఫోన్లపై ఓ లుక్కేయవచ్చు. ఇవన్నీ ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉన్నాయి. అలాగే ధర కూడా రూ.15వేల లోపే ఉంది. మరి ఆ ఫోన్లు ఏమిటంటే..
1. రెడ్‌మీ నోట్ 10టి 5జి స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999గా ఉంది. ఇందులో 5జి లభిస్తుంది. అలాగే 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లు ఉన్నాయి.
2. ఒప్పో ఎ74 5జి స్మార్ట్ ఫోన్ ధర రూ.17,990 గా ఉంది. కానీ ఏదైనా ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే దీన్ని ఇంకా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీంతో ధర చాలా తగ్గుతుంది. ఇక ఈ ఫోన్‌లో.. 6.49 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లు ఉన్నాయి.
3. పోకో ఎం3 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్ ధర రూ.15,999గా ఉంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లు ఉన్నాయి.
4. రియల్‌మి 8 5జి స్మార్ట్ ఫోన్ ధర రూ.15,499గా ఉంది. ఇందులో 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లు ఉన్నాయి.
5. రెడ్‌మీ నోట్ 11టి 5జి స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. ఇందులో 6.6 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా, 6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లు ఉన్నాయి. కాగా ఈ ఫోన్లు అన్నింటిలోనూ 5జి లభిస్తుంది. పైగా ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.