Pooja Hegde : ప్రభాస్, పూజాహెగ్డెలు ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం.. రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే పూజా హెగ్డె తాజాగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో మీడియా ప్రతినిధులు వేసిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పింది.
రాధేశ్యామ్ చిత్రాన్ని చాలా నెలల నుంచి తీస్తున్నారు కదా.. మీకు విసుగు అనిపించలేదా ? ఎప్పుడూ అలసిపోలేదా ? అని అడిగిన ప్రశ్నకు పూజా హెగ్డె బదులిస్తూ.. డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమా తరువాత రాధే శ్యామ్‌లో ఆఫర్ వచ్చింది. ఈ సినిమాను నేను చేసేందుకు ప్రభాస్, ప్రొడక్షన్ హౌస్ కారణాలు అని చెప్పవచ్చు. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు, సీరియస్ స్టోరీ. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.. అని సమాధానం చెప్పింది.
ఇక రాధేశ్యామ్ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి చెప్పమని అడగ్గా.. ఇందులో నా పాత్ర పేరు ప్రేరణ. ఫన్ లవింగ్ డాక్టర్ పాత్రలో నటించాను. పూర్తిగా ఎమోషన్స్ ఉంటాయి. నా పాత్రలో చాలా డీప్ రోల్ ఉంటుంది. ఈ సినిమాలో ప్రేరణను ప్రేక్షకులు చాలా కాలం పాటు గుర్తుపెట్టుకుంటారు.. అని బదులిచ్చింది.
ఇక జ్యోతిష్యం నమ్ముతారా అని అడగ్గా.. అవును, నమ్ముతాను, గతంలో నా కెరీర్ గురించి జ్యోతిష్యుల వద్దకు వెళ్లాను. కొన్ని నిజమే అయ్యాయి, అయినప్పటికీ జ్యోతిష్యాన్ని నమ్ముతాను.. అని పూజా హెగ్డె సమాధానం చెప్పింది.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్‌కు, మీకు మనస్ఫర్థలు వచ్చాయని అడగ్గా.. ప్రభాస్ ఒక గొప్ప నటుడు, ఆయన నాకు, నా తల్లికి తన ఇంట్లో వంట వండించి పంపించారు. సినిమాలో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది, మేము చాలా అద్భుతంగా కనిపించాం.. అని జవాబు చెప్పింది.
పాన్ ఇండియా సినిమాల్లో వర్క్ చేస్తారా.. అని అడగ్గా.. ఆఫర్లు వస్తే వదులుకోకుండా చేస్తానని పూజా సమాధానం చెప్పింది. చివరిగా.. మీరు జీవితంలో ఎవర్నయినా ప్రేమించారా ? అని అడగ్గా.. లేదు, ప్రస్తుతం నేను ఏడాదికి 5 సినిమాలు చేస్తున్నా.. నాకు అంత సమయం లేదు. ప్రేమకు ఇప్పుడు అంత టైమ్ కేటాయించలేను.. అని పూజా హెగ్డె సమాధానం చెప్పింది.