Liger Movie : విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం.. లైగర్. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాక్సింగ్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంతర్జాతీయ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఇక లైగర్ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుండగా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజాగా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. లైగర్ సినిమాలో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్‌లో నటించనున్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. విజయ్ దేవరకొండకు చాలా నెలల నుంచి హిట్స్ లేవు. పైగా ఆయనతో కలిసి పూరీ తదుపరి సినిమా చేస్తున్నారు. జనగనమణ అనే సినిమాను ఫిక్స్ చేశారు. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలు కావాలంటే విజయ్ లైగర్ మూవీ హిట్ అవడం తప్పనిసరి. లేదంటే విజయ్‌కి ఇబ్బందులు వస్తాయి. కెరీర్‌లో ముందుకు సాగలేడు. కనుక లైగర్ సినిమా హిట్ కావడం తప్పనిసరి అయింది.
కనుక ఈ సినిమాను హిట్ చేసేందకు పూరీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సినిమాకు భారీ హైప్ తెస్తున్నారు. ఇక ఇందులో నందమూరి బాలకృష్ణను గెస్ట్ రోల్‌లో నటింపజేయడం ద్వారా సినిమాకు మంచి బూస్టింగ్ లభిస్తుందని అంటున్నారు. అసలే అఖండ హిట్ తో బాలయ్య మంచి ఊపు మీద ఉన్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ద్వారా కూడా మంచి టాక్‌ను తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆయనను లైగర్ సినిమాలో నటింపజేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. మరి లైగర్ మూవీ సక్సెస్ సాధిస్తుందా.. లేదా.. అనేది చూడాలి.