Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్‌లో కార్తీకదీపం ఒకటి. ఈ సీరియల్‌ను చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ చూస్తారు. కార్తీక దీపం సీరియల్ వస్తుందంటే చాలు.. ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఎన్నో రోజుల నుంచి కొనసాగుతున్న ఈ సీరియల్‌లో తాజాగా ప్రేక్షకులకు భారీ షాక్ ఇచ్చారు. ఇందులో ప్రధాన పాత్రల్లో కొనసాగుతున్న డాక్టర్ బాబు, దీపలను చంపేశారు. వారు యాక్సిడెంట్‌లో చనిపోయినట్లు చూపించారు. దీంతో ఇకపై వారు కనిపించరు కాబోలని అనుకున్నారు. అయితే కేవలం రేటింగ్స్‌ను పెంచుకుంటానికి ఇలా చేశారు కావచ్చని భావించారు. కానీ నిజంగానే వారి క్యారెక్టర్లకు ముగింపు పలికారు.
కార్తీకదీపం సీరియల్‌లో మొదటి నుంచి కార్తీక్, దీప అనే ఇద్దరు క్యారెక్టర్ల చుట్టే స్టోరీ తిరుగుతుంది. మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతోపాటు ఎన్నో నెలల నుంచి సాగదీస్తుండడంతో సీరియల్‌పై ఆసక్తి కూడా తగ్గిపోయింది. కనుకనే మళ్లీ ఈ సీరియల్‌పై ఆసక్తి పెంచేందుకు డైరెక్టర్ ఈ పనిచేశారట. ఇక ఇన్నాళ్లూ ప్రధాన పాత్రల చుట్టూ తిరిగిన కథ ఇకపై వారి పిల్లల చుట్టూ తిరుగుతుందట. దీంతో కొత్త జనరేషన్ మధ్య పోరు ఉంటుందని అంటున్నారు. అందులో భాగంగానే ఒక పాయింట్‌ను కూడా క్రియేట్ చేశారు.
కార్తీక్, దీప చనిపోయేందుకు హిమనే కారణమని శౌర్య పగబడుతుంది. దీంతో ఈ జనరేషన్ మధ్య గొడవలు జరుగుతాయని.. ఇకపై కథ వీరి చుట్టూనే తిరుగుతుందని స్పష్టమవుతోంది. అయితే ఈ సీరియల్‌కు ఇక ముగింపు పలకకుండా కొత్త జనరేషన్‌ను ఇందులో భాగం చేయడం కోసమే ఇలా చేసినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది. ఏది ఏమైనా ఇన్ని రోజుల పాటు కనిపించిన డాక్టర్ బాబు, వంటలక్క ఇకపై ఈ సీరియల్‌లో కనిపించబోరు అన్న విషయం తెలిసి ప్రేక్షకులు షాక్ తింటున్నారు. మరి వారు ఈ సీరియల్‌ను ముందు ముందు ఆదరిస్తారా.. లేదా.. అన్నది చూడాలి.