IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌కు గాను టీమ్‌లు ఇప్పటికే గ్రౌండ్స్‌కు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తాజాగా తమ టీమ్‌కు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది. గత సీజన్ వరకు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉండగా.. అతను ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి స్థానంలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ డుప్లెసిస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. వచ్చే ఐపీఎల్ 2022 సీజన్‌కు డుప్లెసిస్ ఆర్‌సీబీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఆ టీమ్ శనివారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
గత సీజన్‌లో బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. కానీ ఓటమి పాలైంది. అయితే బెంగళూరు ఇప్పటి వరకు అనేక సార్లు ప్లే ఆఫ్స్‌కు, ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ట్రోఫీని సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే కెప్టెన్‌గా పనిచేసి అలసిపోయానంటూ కోహ్లి తప్పుకున్నాడు. దీంతో ఆర్సీబీ డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఇక డుప్లెసిస్ బెంగళూరుకు 7వ కెప్టెన్‌గా పనిచేయనున్నాడు. ఇప్పటి వరకు ఈ జట్టుకు ద్రావిడ్, కుంబ్లే, కెవిన్ పీటర్సన్, షేన్ వాట్సన్, కోహ్లి, వెటోరిలు కెప్టెన్‌లుగా పనిచేశారు. ఇక ఇప్పుడు డుప్లెసిస్ కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు.
అయితే డుప్లెసిస్ ఐపీఎల్‌లో మొన్నటి వరకు చెన్నై టీమ్‌కు ఆడాడు. ఈ క్రమంలోనే అతన్ని ఇటీవల జరిగిన మెగా వేలంలో ఆర్‌సీబీ రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో డుప్లెసిస్ చెన్నై తరఫున ఆడి ఉత్తమ ప్రదర్శన చేశాడు. మొత్తం 16 మ్యాచ్‌లలో 633 పరుగులు చేశాడు. అయితే డుప్లెసిస్‌ను కెప్టెన్‌గా పెట్టుకున్న బెంగళూరు ఈసారి అయినా లక్‌ను మార్చుకుంటుందా ? ట్రోఫీ సాధిస్తుందా ? అన్నది చూడాలి.