Samantha : సోషల్ మీడియాలో సమంత ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మధ్యే ఓ అవార్డుల కార్యక్రమానికి వెళ్లిన సమంత అందాల ఆరబోతతో అందరినీ షాక్‌కు గురి చేసింది. ఎద అందాలు మొత్తం కనిపించేలా ఆమె ధరించిన డ్రెస్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈమె విడాకుల తరువాతనే ఇంకా రెచ్చిపోతుందిగా.. అంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. ఇక తాజాగా ఆమె మరోసారి వెకేషన్‌కు వెళ్లింది.
నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత ఖాళీ సమయం దొరికితే చాలు.. వెకేషన్స్‌కు వెళ్తోంది. అందులో భాగంగానే అప్పట్లో రిషికేష్ వెళ్లింది. తరువాత గోవా, మొన్నీ మధ్య కేరళకు వెళ్లి వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా డెహ్రాడూన్‌కు వెళ్లింది. అక్కడ ఎంతో పురాతన కాలం నుంచి ఉన్న చెట్లను, ప్రకృతి అందాలను చూస్తూ సమంత వెకేషన్‌ను గడుపుతోంది. అక్కడి చెట్లను కౌగిలించుకుంటూ ప్రేమను ఒలకబోస్తోంది. ఈ క్రమంలోనే ఆ ఫొటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫొటోలను షేర్ చేసిన సమంత ఫ్రీ హగ్స్ అనే క్యాప్షన్‌ను కూడాపెట్టింది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఈమె వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ అనే ప్రాజెక్టులో నటిస్తోంది. అలాగే అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాలీవుడ్ సినిమాలోనూ యాక్ట్ చేస్తోంది. యశోద అనే పాన్ ఇండియా సినిమాతోపాటు శాకుంతలం అనే మరో మూవీలోనూ నటిస్తోంది. ఇక ఈమె నటించిన తమిళ సినిమా కాతు వాకుల రెండు కాదల్ ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.