MP Navneet Kaur : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఫీవర్ ఇంకా తగ్గడం లేదు. ఈ సినిమాలోని డైలాగ్స్‌ను చాలా మంది చెబుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇందులోని పాటలకు స్టెప్పులు కూడా వేస్తున్నారు. సాధారణ ప్రేక్షకులు మొదలుకొని సెలబ్రిటీలు, క్రికెటర్లు కూడా పుష్ప జపం చేస్తున్నారు. అందులో భాగంగానే వారు చెబుతున్న డైలాగ్స్, వేస్టున్న స్టెప్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ జాబితాలో నటి, ఎంపీ నవనీత్ కౌర్ కూడా చేరిపోయింది.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ప్రముఖ డైలాగ్‌ను అందరూ చెబుతున్నారు. ముఖ్యంగా పుష్ప అంటే.. ఫ్లవర్ అనుకుంటివా.. కాదు ఫైర్.. అనే డైలాగ్‌ను చాలా మంది చెబుతున్నారు. ఇక ఇదే డైలాగ్‌ను ఎంపీ నవనీత్ కౌర్ కొద్దిగా మార్చి చెప్పింది. నవనీత్‌కౌర్ నామ్ సున్‌కే క్యా హోరహా హై.. ఫ్లవర్ నహీ.. ఫైర్ హై.. ఫైర్.. అని ఆమె పుష్ప సినిమాలోని డైలాగ్‌ను చెప్పింది. దీంతో ఆమె వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
View this post on Instagram
కాగా నవనీత్ కౌర్ రాజకీయాల్లోకి రాకముందు నటిగా పలు సినిమాల్లో నటించారు. ఆమె 2003లో శీను వాసంతి లక్ష్మి అనే చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తరువాత జగపతి, గుడ్ బాయ్, రూమ్ మేట్స్, యమదొంగ వంటి చిత్రాల్లో నటించి అలరించారు. ఆ తరువాత ఆమె వివాహం చేసుకున్నారు. అనంతరం భర్త ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. భర్త రాజకీయ వేత్త కనుక ఆమె ఎంపీ అవడం పెద్ద కష్టమేమీ కాలేదు. ప్రస్తుతం ఆమె అమరావతి ఎంపీగా కొనసాగుతున్నారు.