Pushpa Movie : అల్లు అర్జున్, రష్మిక మందన్నలు హీరో హీరోయన్లుగా వచ్చిన చిత్రం.. పుష్ప. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. భారీ స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. హిందీ మార్కెట్‌లోనూ ఘన విజయం సాధించింది. దీంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. అయితే ఇందులో కేవలం ఐటమ్ సాంగ్ లో నటించినందుకే సమంతకు ఎంతో పేరు వచ్చింది. ఈ క్రమంలోనే పుష్ప 2 లోనూ ఇలాంటి ఓ ఐటమ్ సాంగ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక పుష్ప 2 సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుందని తెలుస్తుండగా.. అందులోనూ ఊ అంటావా.. పాటలాగే ఓ ఐటమ్ సాంగ్ ను పెట్టనున్నారట. అందులో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని నటిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఐటమ్ సాంగ్ కోసం మేకర్స్ దిశా పటానిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమె ఓకే చెబితే ఐటమ్ సాంగ్‌లో నటించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఆమె అడిగనంత రెమ్యునరేషన్‌ను కూడా ఇచ్చేందుకు మేకర్స్ రెడీగా ఉన్నారట.
కాగా పుష్ప మొదటి పార్ట్‌కు అల్లు అర్జున్ రూ.45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుండగా.. రెండో పార్ట్‌కు మాత్రం ఆయన హిందీ హక్కులు పూర్తిగా కావాలని అడిగారట. దీంతో మేకర్స్ సందిగ్ధంలో పడ్డారట. ప్రస్తుతం ఇదే విషయంపై అల్లు అర్జున్ కు, మేకర్స్‌కు చర్చలు నడుస్తున్నాయట. కనుకనే పుష్ప 2 షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. మరి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.