కాకరకాయ జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల షుగర్ తగ్గుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కాకరకాయ షుగర్‌కు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. దీన్ని నిత్యం తాగడం వల్ల షుగర్ తగ్గడమే కాదు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక బరువు తగ్గవచ్చు. ఇంకా అనేక లాభాలు దీంతో మనకు కలుగుతాయి. అయితే కాకరకాయ జ్యూస్‌ను కొందరు తాగేందుకు ఇష్టపడరు. కారణం.. అది చాలా చేదుగా ఉంటుంది. కొందరికి వాంతికి వచ్చినట్లు కూడా అవుతుంది.
అయితే కాకరకాయ జ్యూస్‌ను తాగలేం. ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా ? అని అడిగే వారికి కింద తెలిపిన విధానం సరిగ్గా పనిచేస్తుంది. అందుకు ఏం చేయాలంటే…
* ఒక పొడుగు కాకరకాయను తీసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. లేదా చక్రాల్లా కూడా కట్ చేయవచ్చు.
* ఒక పాత్ర తీసుకుని అందులో ముక్కలకు అనుగుణంగా నీటిని పోయాలి. సుమారుగా 400 ఎంఎల్ నుంచి 500 ఎంఎల్ వరకు నీటిని పోయవచ్చు.
* నీటిని పోశాక అందులో కాకరకాయ ముక్కలను వేయాలి.
* రాత్రంతా ఆ ముక్కలను ఆ నీటిలో అలాగే ఉంచాలి.
* మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే ఆ నీటిని తాగాలి.
* తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తీసుకోకూడదు.
ఇలా కాకరకాయ జ్యూస్‌కు బదులుగా వాటితో తయారు చేసే డిటాక్స్ వాటర్‌ను కూడా నిత్యం తాగవచ్చు. దీంతో కూడా పైన తెలిపిన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా షుగర్ లెవల్స్ బాగా తగ్గుతాయి.