Fat : ఊబకాయంతో బాధపడే వారు రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. ఊబకాయం సమస్య నుండి బయట పడడానికి రకరకాల డైట్ లను పాటిస్తున్నారు. ఈ డైట్ లలో ఒకటి వాటర్ డైట్. సాధారణంగా మన శరీరంలో కొవ్వు అధికంగా పేరుకు పోవడం వల్ల ఊబకాయం వస్తుంది. శరీరానికి ప్రేగుల ద్వారా అందవలసిన చక్కెర అందనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు శరీరానికి కావల్సిన చక్కెరను అందించడానికి పిట్యూటరి గ్రంథి గ్రోత్ హార్మోన్ ను విడుదల చేస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ మన శరీరంలో ఉండే కాలేయానికి వచ్చి చేరుతుంది. ఈ హార్మోన్ ప్రభావం వల్ల కాలేయం ఇన్సులిన్ లాంటి మరో గ్రోత్ హార్మోన్ ను రక్తంలోకి విడుదల చేస్తుంది.
ఈ హార్మోన్ కొవ్వు కణాల నుంచి నిల్వ ఉన్న కొవ్వును కరిగిస్తుంది.ఇలా కరిగిన కొవ్వులో ఉండే చక్కెరను శరీరం ఉపయోగించుకుంటుంది. కనుక రక్తంలోకి చక్కెరను చేరకుండా చేయడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది. మనం తీసుకునే ఆహారం నుండి మన శరీరంలోకి చక్కెర చేరుతుంది. మనం తీసుకునే ఆహారాన్ని తగ్గించి కేవలం నీటిని మాత్రమే తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉండే కొవ్వు తగ్గుతుంది. దీనినే వాటర్ డైట్ అంటారు. ఈ వాటర్ డైట్ ను రెండు విధాలుగా పాటించవచ్చు.
మొదటిగా మనం సాయంత్రం తినే భోజనాన్ని 6 గంటల సమయం లోపే ముగించాలి. 6 గంటల తరువాత ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ భోజనంలో పండ్లను అధికంగా తీసుకోవాలి. పండ్ల ద్వారా మన శరీరానికి అందే చక్కెర తక్కువగా ఉంటుంది కనుక ఈ చక్కెరను రాత్రి 10 గంటల సమయంలోపే మన శరీరం ఉపయోగించుకుంటుంది. మన శరీరానికి గంటకు 60 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. రాత్రి సమయంలో మన శరీరానికి ఎటువంటి చక్కెర అందదు కనుక శరీరంలో పేరుకు పోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ డైట్ ను పాటించే వారు ఉదయం 10 గంటల వరకు కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. కేవలం నీటిని మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది.
వాటర్ డైట్ ను పాటించడంలో రెండవ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానంలో ఒక రోజంతా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవలం నీటిని మాత్రమే తాగాలి. నీరసంగా అనిపించినప్పుడు నిమ్మ రసం, తేనె కలిపిన నీటిని కొద్దిగా తాగాలి. దీని వల్ల శరీరానికి ఆహారం ద్వారా చక్కెర అందకపోవడం వల్ల.. నిల్వ ఉన్న కొవ్వును కరిగించి అందులో ఉండే చక్కెరను శరీరం ఉపయోగించుకుంటుందని.. వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కనుక ఈ రెండు డైట్‌లను పాటించడం వల్ల అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. కొవ్వు వేగంగా కరుగుతుంది. అయితే ఈ రెండింటిలో ఏదైనా ఒక డైట్‌ను మాత్రమే పాటించాలి. రెండింటినీ చేయరాదు. చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక కేవలం ఒక డైట్‌కు మాత్రమే పరిమితం అవ్వాలి.