Apple : యాపిల్ పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తింటే మనకు అనేక పోషకాలు లభిస్తాయి. ఎన్నో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. అయితే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి బయట పడేందుకు యాపిల్ పండ్లను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మలబద్దకాన్ని నివారించేందుకు, విరేచనాలను అరికట్టేందుకు.. రెండు సమస్యలకూ ఒకే ఔషధంగా యాపిల్ పండు పనిచేస్తుంది. అందుకు గాను యాపిల్ పండ్లను భిన్న రకాలుగా తీసుకోవాలి. ఈ పండ్లను నేరుగా తింటే మలబద్దకం తగ్గుతుంది. అదే ఉడకబెట్టి తింటే విరేచనాలు తగ్గుతాయి. ఇలా రెండు రకాలుగా ఈ పండ్లను ఉపయోగించుకోవచ్చు.
2. రోజుకు కనీసం ఒక యాపిల్ పండును తింటే రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. కనీసం 2 వారాల పాటు రోజుకు ఒక యాపిల్‌ను తినడం వల్ల శరీరంలో చెప్పుకోదగిన విధంగా రక్తం తయారవుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి యాపిల్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి.
3. నెలల వయస్సు ఉన్న పిల్లలకు విరేచనాలు అవుతుంటే.. టీస్పూన్ యాపిల్ జ్యూస్‌ను తాగించాలి. దీంతో విరేచనాలు తగ్గుతాయి.
4. యాపిల్ జ్యూస్ లో యాలకుల పొడి, తేనె కలుపుకుని తీసుకుంటుంటే కడుపులో మంట,పేగుల్లో పూత, అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పుల్లని త్రేన్పులు, గుండెల్లో మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
5. రక్త, బంక విరేచనాలు అవుతున్నవారు యాపిల్ జ్యూస్ తీసుకుంటుంటే అందులో ఉండే పిండి పదార్థాలు విరేచనాలలోని నీటి శాతాన్ని తగ్గించడం వల్ల విరేచనాలు తగ్గుతాయి. ఆపిల్ ముక్కలను ఉడికించి తీసుకుంటే ఇంకా మేలు జరుగుతుంది. తరచూ యాపిల్స్ తింటూ ఉంటే జ్వరం తగ్గుతుంది.
6. రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల కడుపులో మంట, మూత్రంలో మంట వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఈ పండ్లలో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. కనుక హైబీపీ ఉన్నవారు రోజుకు ఒక యాపిల్ పండును తినాలి. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
7. రోజుకో యాపిల్ పండును తినడం వల్ల పక్షవాతం, నాడీ సంబంధ వ్యాధులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. చిన్నారులు అయితే మెదడు చురుగ్గా మారుతుంది. యాక్టివ్‌గా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. పెద్దలకు మతిమరుపు తగ్గుతుంది.
8. పచ్చ కామెర్లు అయిన వారు రోజూ ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్‌ను తాగితే ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. రోజూ యాపిల్ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలోని కఫం మొత్తం బయటకు పోతుంది. అలాగే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అయితే షుగర్ ఉన్నవారు యాపిల్ జ్యూస్ కాకుండా పండ్లనే నేరుగా తినాలి.
9. యాపిల్ పండును రోజుకు ఒక దాన్ని తింటే పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. నీరసం తగ్గుతుంది. శరీరం మీద ఉండే మచ్చలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే ఏలిక పాములు నశిస్తాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
10. రోజుకో యాపిల్ పండును తినడం వల్ల క్యాన్సర్లు రావని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ పండ్లను తింటే మైగ్రేన్ వంటి తలనొప్పి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. 2 లేదా 3 వారాల పాటు రోజుకో యాపిల్ పండును తింటే మైగ్రేన్ నుంచి బయట పడవచ్చని అంటున్నారు.
11. జీర్ణ సమస్యలను తగ్గించడంలో, అల్సర్‌లను నయం చేయడంలో.. యాపిల్ పండ్లు బాగా పనిచేస్తాయి. అలాగే గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. హైబీపీని అదుపులో ఉంచుతాయి. యాపిల్ పండ్లను తింటే పొడి దగ్గు కూడా తగ్గుతుంది.
12. మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నవారు 15 రోజుల నుంచి 30 రోజుల పాటు రోజుకు ఒక గ్లాస్ యాపిల్ జ్యూస్‌ను తాగాలి. దీంతో రాళ్లు పడిపోతాయి. అలాగే ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఒకటి లేదా రెండు నెలలపాటు రోజుకో యాపిల్ పండును తింటే.. కంటి చూపు బాగా పెరుగుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఇలా యాపిల్ పండ్లతో అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు.