Almonds : మనకు తినేందుకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో నట్స్ ఒకటి. వీటిలో బాదంపప్పు చాలా ముఖ్యమైంది. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అందరూ సులభంగా జీర్ణమయ్యేలా వీటిని తినాలంటే.. రాత్రి పూట నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపునే తినాలి. అప్పుడే బాదం పప్పుతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇక బీబీసీ చేపట్టిన పరిశోధనల ప్రకారం.. మనకు అందుబాటులో ఉన్న టాప్ 1000 ఆహారాల్లో అత్యధికంగా పోషకాలు కలిగి ఉన్న ఆహారంగా బాదంపప్పు పేరుగాంచింది. ఈ పప్పులో మన శరీరానికి అవసరం అయ్యే దాదాపు అన్ని పోషకాలు ఉంటాయని తేల్చారు. కనుక బాదంపప్పును తరచూ ఆహారంలో తీసుకోవాలి.
బాదంపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. కనుకనే మనకు అందుబాటులో ఉన్న టాప్ 1000 పోషకాహారాల్లో బాదం పప్పు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇక ఆ జాబితాలో బాదంపప్పుకు అత్యధికంగా 100కు 97 పాయింట్లు వచ్చాయి. అంటే.. అత్యధిక పోషకాలు ఉండేది వీటిల్లోనే అనే విషయం మాత్రం స్పష్టమైంది. బాదంపప్పులో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కనుకనే దీన్ని సైంటిస్టులు అత్యుత్తమ ఆహారంగా చెబుతున్నారు.
బాదంపప్పుతోపాటు అత్యధిక పోషకాలు ఉన్న ఆహారాల జాబితాలో చియా విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు కూడా ఉండడం విశేషం. అంటే బాదంపప్పు కాకుండా ఆయా ఆహారాల్లోనూ పోషకాలు అత్యధికంగా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. కాగా బాదంపప్పులో 100 గ్రాముల పప్పుకు 25 గ్రాముల ప్రోటీన్లు, 27 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, 14 గ్రాముల కార్బొహైడ్రేట్లు ఉంటాయి. అలాగే విటమిన్లు బి1, బి2, విటమిన్ ఇ, బి5, విటమిన్ సి కూడా ఉంటాయి. వీటితోపాటు పొటాషియం, సోడియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, జింక్, కాపర్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ కూడా బాదంపప్పులో ఉంటాయి. కనుక బాదంపప్పులో అత్యధిక స్థాయిలో పోషకాలు ఉంటాయని చెప్పవచ్చు.
బాదంపప్పులో మన శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. అలాగే ఒక గ్లాస్ పాలతో పోల్చితే 3 రెట్ల అధిక కాల్షియం గుప్పెడు బాదం గింజల్లో ఉంటుంది. కనుక కాల్షియం మనకు పాల కన్నా బాదంపప్పుతోనే అధికంగా లభిస్తుందని చెప్పవచ్చు. ఇక బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది. 100 గ్రాముల బాదంపప్పును తింటే 25 మిల్లీగ్రాముల విటమిన్ ఇ లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పురుషుల్లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. కనుక ఎటు చూసినా సరే బాదంపప్పు మనకు ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. వీటిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.