Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం కూర‌గాయ‌లు

రోజూ 3 టమాటాలను నూనె లేకుండా ఉడకబెట్టి తినండి.. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి..

Editor by Editor
August 19, 2022
in కూర‌గాయ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మనకు అందుబాటులో ఉన్న అత్యంత తక్కువ ధర కలిగిన కూరగాయల్లో టమాటాలు ఒకటి. వీటిని మనం రోజూ కూరల్లో వేస్తుంటాం. టమాటాలతో మనం అనేక వంటకాలను తయారు చేయవచ్చు. అయితే వంటకాలను చేయడం కన్నా వాటిని కాస్తంత ఉడికించి నేరుగా తింటేనే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మూడు టమాటాలను తీసుకుని నూనె లేకుండానే గిన్నెలో ఉడకబెట్టి వాటిని అలాగే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌తో కలిపి తినాలి. దీంతో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఇలా తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటాల్లో విటమిన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్‌ ఎ, సి అధికంగా ఉంటాయి. వీటి వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల టమాటాలను తింటే సీజనల్‌గా వచ్చే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే టమాటాల్లో ఉండే విటమిన్‌ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. దీంతో కంటి వ్యాధులు తగ్గుతాయి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

eat daily 3 boiled tomatoes for these wonderful health benefits

టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో లైకోపీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండెను సంరక్షిస్తుంది. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక టమాటాలను రోజూ తినాలి. అలాగే టమాటాల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, మలబద్దకం, అసిడిటీ, అజీర్ణం తగ్గుతాయి. అలాగే అధిక బరువును తగ్గించడంలోనూ ఈ ఫైబర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజూ టమాటాలను తినడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారికి టమాటాలు మేలు చేస్తాయి.

టమాటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. దీని వల్ల రక్త నాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో హార్ట్‌ ఎటాక్‌ల రావు. అలాగే షుగర్‌ వ్యాధి గ్రస్తులకు కూడా టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. దీంతో డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది.

టమాటాల్లో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం కాంతివంతంగా మృదువుగా మారుతుంది. చర్మ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అలాగే శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఇలా టమాటాలను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Tags: tomatoes
Previous Post

రాత్రి పూట పాలలో అల్లం రసం కలిపి తాగండి.. ఈ సీజన్‌లో తప్పక తాగాల్సిందే..

Next Post

కొర్ర‌ల‌ను రోజూ ఆహారంలో భాగంగా తింటున్నారా.. అయితే ముందు ఇవి చద‌వండి..

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!