Cashew Nuts : మనకు అందుబాటులో ఉన్న వివిధ రకాల నట్స్ లో జీడిపప్పు ఒకటి. ఇది చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. కనుక దీన్ని తినేందుకు చాలా మంది అంతగా ఆసక్తిని చూపించరు. అయితే వాస్తవానికి జీడిపప్పులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా అవసరం. అందువల్ల ఖరీదు ఎక్కువగా ఉన్నా సరే జీడిపప్పును రోజూ తినాల్సిందే. దీన్ని తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి.
జీడిపప్పును రోజూ ఉదయం తింటేనే అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మన శరీరానికి ఉదయం కావల్సిన శక్తితోపాటు పోషకాలను అందించే గుణాలు జీడిపప్పులో అధికంగా ఉంటాయి. కనుక జీడిపప్పును ఉదయం పూట తింటేనే మనకు మేలు జరుగుతుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి 5 జీడిపప్పు పలుకులను తీసుకోవాలి. ఇలా రోజూ తినాలి. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
జీడిపప్పులో మన శరీరానికి కావల్సిన విటమిన్లు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ కె ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులను రాకుండా చూస్తాయి. గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చూస్తాయి. దీంతో తీవ్ర రక్త స్రావం కాకుండా ఉంటుంది. అలాగే జీడిపప్పులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా మారుస్తుంది. వీటిలోని పొటాషియం బీపీని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి.
జీడిపప్పులో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా మారుస్తుంది. దీని వల్ల నిద్ర చక్కగా పడుతుంది. అలాగే ఈ పప్పులో ఉండే జింక్ రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది. జీడిపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఇలా జీడిపప్పుతో మనం అనేక లాభాలను పొందవచ్చు. కనుక వీటిని రోజూ ఉదయం 5 చొప్పున తినాలి. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.