Lakshmi Devi Blessings : లక్ష్మీ దేవి కటాక్షం మనపై ఉండాలని, ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ శాంతులు ఉండాలని, డబ్బుకు ఎటువంటి లోటు ఉండకూడదని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కూడా. లక్ష్మీ దేవి అనుగ్రహం మనపై ఉండాలన్నా, లక్ష్మ దేవి మన ఇంట్లోకి రావాలన్నా మన ఇంటి ప్రాంగణంలో ఈ 5రకాల మొక్కలను తప్పకుండా పెంచుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల లక్ష్మీ దేవి మన ఇంట్లోకి రావడంతో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుందని వారు తెలియజేస్తున్నారు. లక్ష్మీ దేవి మన ఇంట్లోకి రావాలంటే మన ఇంటి ముందు పెంచుకోవాల్సిన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ దేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ప్రథమంగా మన ఇంటి ముందు తులసి మొక్క ఉండాలి. కృష్ణ తులసి, రామ తులసి అనే రెండు రకాల తులసి మొక్కలు మన ఇంటి ముందర ఉండాలని పండితులు చెబుతున్నారు. ప్రతి నిత్యం ఆ తులసి మొక్కలకు నీరు పోస్తూ లక్ష్మీ నారాయణ సమేతమైన తులసి మొక్కకి నమస్కరించాలి.
నిత్యం ఇలా చేస్తూ ఉండడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు. అలాగే లక్ష్మీ అనుగ్రహం కోసం కలబంద మొక్కను కూడా మన ఇంటి ముందు పెంచుకోవాలని పండితులు చెబుతున్నారు. కలబంద మొక్కకు ముళ్లు ఉన్నప్పటికి దీనిని పెంచుకోవడం వల్ల మనకు ఎంతో మేలు కలుగుతుందని వారు చెబుతున్నారు. కలబంద మొక్క లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతికరమైనదని దీనిని పెంచుకోవడం వల్ల లక్ష్మీ దేవి కృప మనపై ఉంటుందని వారు చెబుతున్నారు. ఇక లక్ష్మీ అనుగ్రహం కోసం మనం పెంచుకోవాల్సిన మూడవ మొక్క మనీ ప్లాంట్. ఈ మొక్క మనందరికి తెలిసిందే. ఈ మొక్కను మనలో చాలా మంది ఇంట్లో, ఇంటి ఆవరణలో పెంచుకుంటూ ఉంటారు కూడా. అయితే మనీ ప్లాంట్ మొక్కను ఎల్లప్పుడూ కూడా పైకి పాకుతూ ఉండేలా చూసుకోవాలి. మనీప్లాంట్ మొక్క తీగలు పైకి ఎదిగే కొద్ది మన ఇంట్లో వృద్ది కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ మొక్క తీగలు కిందికి చూడకుండా అలాగే నేలపై పాకకుండా ఉండేలా చూసుకోవడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
అదేవిధంగా మన ఇంట్లో ఉండాల్సిన మరో మొక్క బిళ్వవృక్షం. బిళ్వ పత్రాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవని మనందరికి తెలుసు. బిళ్వవృక్షంలో ఎల్లప్పుడూ లక్ష్మీ దేవి నివాసం ఉంటుందని పండితులు చెబుతున్నారు. బిళ్వ వృక్షం అనగానే మనలో చాలా మందికి ఈ మొక్కకు ముళ్లు ఉంటాయి కనుక దీనిని ఇంట్లో పెంచుకోకూడదు కదా అనే సందేహం వస్తూ ఉంటుంది. కానీ బిళ్వ వృక్షానికి ఇటువంటి పట్టింపులు ఏమి ఉండవని ఈ వృక్షానికి మినహాయింపు ఉంటుందని కనుక ఈ మొక్కను ఇంటి ముందర పెంచుకోవచ్చని పండితులు చెబుతున్నారు. బిళ్వ వృక్షానికి నిత్యం పూజలు చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇక మన ఇంట్లో ఉండాల్సిన ఐదవ మొక్క పసుపు మొక్క. పసుపును మనం ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటాము. పసుపు మొక్కలో ఎల్లప్పుడూ లక్ష్మీ దేవి ఉంటుందని ఈ మొక్క మన ఇంటి ఆవరణలో ఉండడంవల్ల లక్ష్మీ దేవి మన ఇంట్లో అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ఈ 5 మొక్కలను మన ఇంటి ముందు, ఇంటి ఆవరణలో పెంచుకుంటూ నిత్యం పూజించడం వల్ల లక్ష్మీ దేవి మన ఇంట్లో నివాసం ఉంటుందని లక్ష్మీ అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుందని పండితులు చెబుతున్నారు.