Gems : జ్యోతిష్యశాస్త్ర ఉపశాస్త్రల్లో రత్నశాస్త్రం ఒకటి. పుట్టిన నెలను బట్టి నవరత్నాల్లో ఏ రత్నం ధరిస్తే శుభం చేకూరుతుందో తెలుసుకొని వాటిని ఉంగరంలో కలిపి ధరించడం ద్వారా మనలో ఓ పాజిటివ్ శక్తి ఉద్భవిస్తుంది. మన ఆత్మస్థైర్యానికి ఈ నవరత్నాల్లో మనకు సెట్ అయ్యే ఓ రత్నం తోడై మన పనులను దిగ్విజయం అవ్వడానికి ప్రేరేపిస్తాయి. ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలో తెలుసుకునే ముందు ఓ సారి నవరత్నాల చరిత్ర, సైన్స్ ల గురించి పలు వివరాలను తెలుసుకుందాం.
పూర్వం విష్ణుమూర్తి చేతిలో బాల రాక్షసి సంహారం జరిగింది. అప్పుడామె శరీరం నుంచి రకరకాల రంగుల్లో మెరుస్తూ తొమ్మిది ముక్కలు దేవతామూర్తుల మీద పడ్డాయి. ఆ రంగు దేవతలకు వచ్చింది. అలా ఆ రంగు పొందిన దేవతలే నవగ్రహాలు. ఆ రత్నాలనే నవరత్నాలు అంటారని ఓ పురాణ విషయం. పురాతనకాలంలో రత్నాలను వైద్యం కోసం వాడేవారని గరుడపురాణంలో ఉంది. క్రీస్తుపూర్వం 2800 సంవత్సరాల క్రితం మెసపొటేమియా ప్రజలు రంగు రత్నాలను వాడినట్లు ఆధారాలున్నాయి. అలాగే ఈజిప్టియన్స్, గ్రీక్‌లు వీటిని ధరించేవారు.
ఉంగరానికి ఉండే రాళ్లు వెదజల్లే కాంతి చేతి వేలి నరానికి సంబంధం ఉంటుంది. ఆ నరాలు మన శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలకు అనుసంధానం చేసి ఉంటాయి. వాటికి రాళ్లను ధరించడం వల్ల వాటినుంచి వెలువడిన కిరణాలు నరాల గుండా ప్రవహించి ముఖ్యమైన వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే సవరిస్తాయి. అంటే ఈ పద్ధతి అంతా ఒక రేడియేషన్‌లా జరుగుతుంది.. అనేది కొందరి భావన.
ఇక ఏ నెలలో పుట్టిన వారు ఏ రత్నం ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి నెలలో పుట్టిన వారు గార్నెట్‌ను ధరించాలి. అలాగే ఫిబ్రవరి అయితే ఎమిథెస్ట్, మార్చి అయితే ఎక్యుమెరైన్, ఏప్రిల్ అయితే వైఢూర్యం ధరించాలి. ఇక మే నెలలో పుట్టిన వారు పచ్చను, జూన్ నెల అయితే ముత్యం, జూలై నెల వారు కెంపును, ఆగస్టు నెల వారు నక్షత్ర నీలాన్ని, సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు ఇంద్ర నీలం, అక్టోబర్ నెల అయితే చంద్రకాంతమణిని ధరించాలి.
ఇక నవంబర్ నెలలో పుట్టిన వారు పుష్యరాగం, డిసెంబర్ నెలలో జన్మించిన వారు పచ్చను ధరిస్తే మేలు జరుగుతుంది. ఇలా ఆయా రత్నాలను ధరించడం వల్ల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.