Money Problems : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఒక్కో వ్యక్తి భవిష్యత్తు అతని గ్రహాల గమనంపై ఆధార పడి ఉంటుంది. అయితే ఇదే కాకుండా ఇంట్లో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఆ ఇంటి కుటుంబ సభ్యుల భవిష్యత్తు కూడా చెప్పవచ్చు. ఇంట్లో కొన్ని సంఘటనలు జరిగితే అశుభంగా భావిస్తారు. అయితే అలాంటి సంఘటనల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి. ఇక ఎలాంటి సంఘటనలు జరిగితే.. ఆర్థిక సమస్యలు వస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
తులసిని దైవంగా పరిగణిస్తారని, దీనిని ప్రతి రోజు ఇంట్లో పూజిస్తారని పండితులు చెప్పారు. మీ ఇంట్లో ఉన్న తులసి అకస్మాత్తుగా ఎండి పోతే, ఇలా జరగడం ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయనడానికి సంకేతం. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అలాగే ఏ కుటుంబంలో కలతలు, కష్టాలు ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదని చెబుతారు. లక్ష్మీ నివసించాలంటే, ఆ ఇంట్లో ప్రేమగా జీవించడం, పెద్దలను గౌరవించడం, ఇంటి కోడలిను గౌరవించడం నేర్చుకోవాలి. ఇంటి కోడలు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కనుక ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలి. అప్పుడే సమస్యలు రావు. గొడవలు ఉంటే ఆర్థిక సమస్యలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి.

ఇక ఇంట్లో అద్దం పగిలితే అశుభంగా భావిస్తాం. పదేపదే గాజు వస్తువులు పగిలిపోతే ఆ ఇంటిని ఆర్థిక సమస్యలు చుట్టు ముడతాయని అర్థం. ఇలా పలు రకాల సంఘటనలు జరుగుతుంటే.. మీకు ఏదో చెడు జరగబోతుందని లేదా ఆర్థిక సమస్యలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అందుకు తగిన విధంగా పరిహారం చేసుకుని చర్యలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు చుట్టుముడతాయి.