Onions : ఉల్లిపాయ.. ఇది మనందరికీ తెలిసిందే. వంటల్లో ఉల్లిపాయను మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. దాదాపు 5 వేల సంవత్సరాల నుండి ఉల్లిపాయను మనం ఆహారంగా తీసుకుంటున్నాం. వంటింట్లో ఉండే ఆహార పదార్థాల్లో ఉల్లిపాయ ముఖ్యమైనది. ఉల్లిపాయలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయలను ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. ఉల్లిపాయలను ఉపయోగించడం వల్ల కలిగే 5 ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కోసారి చెవులు మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఎదుటి వారు చెప్పేది వినబడక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వినికిడి శక్తిని కూడా కోల్పోతాం. ఇలాంటి సమస్యను ఉల్లిపాయను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. దీని కోసం ఉల్లిపాయను ముక్కలుగా కోసి చెవిలో పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్క చెవిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ రసం లోపలికి వెళ్లి సమస్య తగ్గుతుంది. వినికిడి శక్తిని ఉల్లిపాయ సులభతరం చేస్తుంది.
మరుసటి రోజు చెవిని జాగ్రత్తగా శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చెవి సమస్య తగ్గి మాటలు చక్కగా వినబడతాయి. కాలిన గాయాలను ఉల్లిపాయతో తగ్గించుకోవచ్చు. కాలిన గాయలను తగ్గించడంలో ఉల్లిపాయ దివ్యౌషధంగా పని చేస్తుంది. ఉల్లిపాయను అడ్డంగా కోసి కాలిన గాయాలపై సున్నితంగా రాయాలి. తరువాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయడం వల్ల కాలిన గాయాల వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. అదే విధంగా తేనెటీగ, కందిరీగ కుట్టిన గాయాల నుండి ఉల్లిపాయ ఉపశమనాన్ని కలిగిస్తుంది.
తేనెటీగ కుట్టిన చోట చాలా నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి ఇవి కుట్టిన చోట రక్తం పేరుకుపోయి గడ్డలుగా మారుతాయి. ఒక్కోసారి ఈ గడ్డలను తొలగించడానికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి వస్తుంది. కనుక తేనెటీగ కుట్టిన వెంటనే కుట్టిన చోట ఉల్లిపాయను రుద్దాలి. అలా చేయడం వల్లనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న వేడి తగ్గుతుంది.
దీని కోసం ముందుగా ఉల్లిపాయను అడ్డంగా ముక్కలుగా కోయాలి. తరువాత ఈ ముక్కలను అరికాళ్ల దగ్గర ఉంచి దానిపై నుండి సాక్స్ ను ధరించాలి. ఇలా చేయడం వల్ల శరీరం వెంటనే చల్లగా మారుతుంది. ఉల్లిపాయలు మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. కనుక ప్రతిరోజూ ఆహారంలో ఉల్లిపాయలు ఉండేలా చూసుకోవాలి. ఉల్లిపాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని వీటిని తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.