Honey With Sesame Seeds : తేనెతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిసిందే. దీంతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. శరీరానికి శక్తి అందుతుంది. అలాగే నువ్వులు. వీటి నుంచి తీసిన నూనెను చాలా మంది వంటల్లో వాడుతారు. నువ్వులను డైరెక్ట్‌గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. అయితే తేనె, నువ్వులను కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి తింటే దాంతో కింద చెప్పిన విధంగా పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. దీంతో ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం పెరుగుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. పోషణ సరిగ్గా అందుతుంది. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రావు.
![Honey With Sesame Seeds : తేనె, నువ్వులను కలిపి ఉదయాన్నే పరగడుపునే తినండి.. ఎన్నో లాభాలు కలుగుతాయి.. Honey With Sesame Seeds take daily on empty stomach for these benefits](https://ayurvedam365-com.in9.cdn-alpha.com//opt/bitnami/wordpress/wp-content/uploads/2022/10/honey-with-sesame-seeds.jpg)
ఈ మిశ్రమాన్ని తినడం వల్ల ఇన్‌స్టంట్ ఎనర్జీ అందుతుంది. ఉదయాన్నే శక్తి అందడం వల్ల బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ఎంత పనిచేసినా అంత త్వరగా అలసిపోరు. ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి. వ్యాయామం చేసే వారికి చక్కని శక్తి అందుతుంది. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. వాపులు పోతాయి. నొప్పులు తగ్గుతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం రావు. పేగులు శుభ్రంగా మారుతాయి. కొవ్వు కరిగిపోతుంది. పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. ఆకలిని తగ్గించడం వల్ల తిండి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు.
చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య పోతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ మిశ్రమాన్ని తినడం వల్ల మెదడుకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. మతిమరుపు పోతుంది. విద్యార్థులు తేనె, నువ్వులను కలిపి రోజూ తింటే చదువుల్లో బాగా ప్రతిభ కనబరుస్తారు. ఇలా ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.