Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Chekkalu Recipe : క‌ర‌క‌ర‌లాడేలా చెక్క‌ల‌ను ఇలా త‌యారు చేస్తే.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..

D by D
November 16, 2022
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Chekkalu Recipe : మ‌నం ర‌క‌ర‌కాల పిండి వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటిని త‌యారు చేసుకుని స్నాక్స్ గా తింటూ ఉంటాం. పిండి వంట‌ల‌ను పండ‌గ‌ల స‌మ‌యంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇలా మ‌నం త‌యారు చేసే పిండి వంట‌ల్లో చెక్క‌లు కూడా ఒక‌టి. ఈ వంట‌కం మ‌నంద‌రికి తెలిసిందే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. దాదాపుగా వీటిని అంద‌రూ త‌యారు చేస్తూ ఉంటారు. కానీ కొంద‌రూ ఎంత‌ ప్ర‌య‌త్నించిన వీటిని క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా త‌యారు చేసుకోలేక‌పోతారు. చెక్క‌ల‌ను రుచిగా తింటున్నా కొద్ది తినాల‌నిపించేలా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండేలా ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

చెక్క‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బియ్యం పిండి – 500 గ్రా., నాన‌బెట్టిన స‌గ్గు బియ్యం – అర క‌ప్పు, నాన‌బెట్టిన మిన‌ప‌ప్పు – అర క‌ప్పు, జీల‌క‌ర్ర – ఒక టేబుల్ స్పూన్, నువ్వులు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన క‌రివేపాకు – 2 రెమ్మ‌లు, త‌రిగిన కొత్తిమీర – స‌గం క‌ట్ట‌, ప‌చ్చిమిర్చి – 6, అల్లం ముక్క – ఒక ఇంచు ముక్క‌, ఉప్పు – త‌గినంత‌, వేడి వేడి నెయ్యి – 2 టేబుల స్పూన్స్, గోరు వెచ్చ‌టి నీళ్లు – త‌గిన‌న్ని, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా.

Chekkalu Recipe in telugu know how to make them
Chekkalu Recipe

చెక్క‌ల త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో ప‌చ్చిమిర్చి, అల్లం ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి పేస్ట్ ను వేయాలి. త‌రువాత నూనె, నీళ్లు త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లూ పోస్తూ పిండిని మ‌రీ మెత్త‌గా కాకుండా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని చిన్న చిన్న గుండ్ర‌టి ముద్ద‌లుగా చేసుకోవాలి. ఇప్ప‌డు పూరీ ప్రెస్ ను తీసుకుని దాని మీద పాలిథిన్ క‌వ‌ర ను ఉంచి క‌వ‌ర్ కు నూనెను రాయాలి. త‌రువాత పిండి ముద్ద‌ను ఉంచి చెక్క‌లా వ‌త్తుకోవాలి. ఇలా వ‌త్తుకున్న చెక్క‌ల‌ను కాట‌న్ వ‌స్త్రం మీద వేయాలి. ఇలా చెక్క‌ల‌ను వ‌త్తుకున్న త‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

నూనె బాగా వేడ‌య్యాక అందులో త‌గిన‌న్ని చెక్క‌ల‌ను వేసి కాల్చుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల రుచిగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే చెక్క‌లు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుడా నిల్వ చేసుకోవ‌డం వల్ల 25 నుండి 30 రోజుల వ‌ర‌కు తాజాగా ఉంటాయి. వీటి తయారీలో రేష‌న్ బియ్యాన్ని ఉప‌యోగించ‌డం వ‌ల్ల చెక్క‌లు మ‌రింత క‌ర‌క‌ర‌లాడుతూ ఉంటాయి. బ‌య‌ట దొరికే చిరుతిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఇంట్లోనే చెక్క‌ల‌ను త‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌వ‌చ్చు.

Tags: Chekkalu Recipe
Previous Post

Gaddi Gulabi Benefits : ఈ మొక్క ఎక్క‌డ క‌నిపించినా స‌రే.. త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి.. లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

Next Post

Teeth Pain Remedy : ఈ చిట్కాను పాటిస్తే.. దంతాల నొప్పి త‌గ్గుతుంది.. గార‌పోయి దంతాలు మెరుస్తాయి..

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.