Giloy Leaves : ప్రస్తుత కాలంలో మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు,వాతావరణ కాలుష్యం, మానసిక ఒత్తిడి, ఆందోళన, కోపం, చికాకు వంటి వాటి వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాం. నేటి తరుణంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, గ్యాస్, అజీర్తి, మలబద్దకం అలాగే రకరకాల జ్వరాల బారిన పడుతున్నారు. పిల్లలు కూడా నేటి కాలంలో అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలా అనారోగ్య సమస్యల బారిన పడగానే చాలా మంది వైద్యున్ని సంప్రదించి మందులను వాడుతున్నారు. కొందరూ వైద్యులను సంప్రదించకుండానే వారంతట వారు మందులను వాడుతుంటారు.
ఇలా మందులను వాడడం వల్ల అప్పటికప్పుడు సమస్యల నుండి ఉపశమనం కలిగిన భవిష్యత్తులో మాత్రం వాటి వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. మనకు వచ్చే ఈ అనారోగ్య సమస్యలను మనం ఆయుర్వేదం ద్వారా కూడా నయం చేసుకోవచ్చు. అలాగే ఆయుర్వేదాన్ని ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. అలాగే సమస్య కూడా శాశ్వతంగా పరిష్కారమవుతుంది. ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించే వాటిల్లో తిప్ప తీగ ఒకటి. దీనిని అమృత వల్లి అని కూడా పిలుస్తారు. చేల కంచెలకు, పెద్ద చెట్లకు అల్లుకుని ఈ మొక్క పెరుగుతుంది.ఈ తీగ మనకు ఎక్కడపడితే అక్కడ విరివిరిగా లభిస్తుంది. తిప్ప తీగ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
ఆయుర్వేదంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఈ తిప్ప తీగను ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిని పిల్లలు, పెద్దలు ఎవరైనా వాడవచ్చు. జ్వరం వచ్చినప్పుడు తిప్ప తీగ ఆకును మెత్తగా దంచి నీళ్లల్లో కలిపి మూడు పూటలా తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు కూడా తగ్గుతాయి. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు రోజుకు రెండు సార్లు ఆహారానికి గంట ముందు రెండు తిప్ప తీగ ఆకులను నమిలి మింగడం వల్ల మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోజూ ఉదయమే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగి రెండు తిప్ప తీగ ఆకులను తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గి మలవిసర్జన సాఫీగా సాగుతుంది.
ఈ విధంగా చేయడం వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్య నుండి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ ఆకులను తినడం వల్ల శరీరంలో రోగ నిరోదక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. ఈ తిప్ప తీగ ఆకులను తినడం వల్ల షుగర్ వ్యాధి కూడా నియంత్రణలోకి వస్తుంది. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో కూడా షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉంటాము. తిప్ప తీగ ఆకులను తినడం వల్ల లేదా ఈ ఆకులతో కషాయాన్ని చేసి తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవ్వడంతో పాటు రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా తిప్పతీగ మనకు ఎంతో దోహదపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.