Acidity : ఎంతటి భయంకరమైన కడుపు నొప్పి అయినా సరే ఒక్కసారి ఇది తింటే చాలు క్షణాల్లో నయం అవుతుంది. అప్పుడప్పుడూ మసాలా పదార్థాలుఎక్కువగా తినడం వల్ల, కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యల వల్ల కూడా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఒక సాధారణమైన సమస్యగా చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాగే ఈ సమస్య చిన్న పిల్లల నుండి పెద్దల వరకు దాదాపుగా అందరికి అప్పుడప్పుడూ వస్తూ ఉంటుంది. కడుపు నొప్పి వల్ల మనకు కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొందరిలో ఈ సమస్య మరీ తీవ్రంగా కూడా ఉంటుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయట పడడానికి కడుపు నొప్పి మాత్రలను వేసుకుంటూ ఉంటారు. మాత్రలే కాకుండా కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి సహజ సిద్దంగా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
ఈ వంటింటి చిట్కా చాలా అద్భుతంగా పని చేస్తుంది. దీనిని వాడడం వల్ల కేవలం 5 నిమిషాల్లోనే మనం కడుపునొప్పి సమస్య నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల గ్యాస్, మలబద్దకం, అసిడిటీ వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. కడుపు నొప్పిని తగ్గించే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం మన వంటగదిలో ఉండే వామును ఉపయోగించాల్సి ఉంటుంది. వాము మన జీర్ణ సమస్యలను తగ్గించే దివ్యౌషధమని చెప్పడంతో ఎటువంటి అతిశయోక్తి లేదు. వామును ఉపయోగించడం వల్ల కడుపులో నొప్పి, గ్యాస్, మలబద్దకం, నులిపురుగులు, ఎసిడిటీ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. దీనిలో ఉండే థైమోల్ అనే పదార్థం పొట్టలో గ్యాస్ తయారయ్యే ప్రక్రియను నిలిపి వేయడంలో సహాయపడుతుంది.
పూర్వకాలంలో కూడా మన పెద్దలు జీర్ణసంబంధిత సమస్యలను తగ్గించడంలో వామునే ఎక్కువగా ఉపయోగించే వారు. దీనికోసం ముందుగా ఒక రోట్లో పావు టీ స్పూన్ వామును తీసుకోవాలి. తరువాత ఇందులో చిటకెడు లేదా రుచికి తగినంత సైంధవ లవణాన్ని వేసి మెత్తగా దంచాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని నేరుగా నోట్లో వేసుకుని చప్పరిస్తూ మింగాలి. తరువాత వెంటనే పావు గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగాలి. కడుపు నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. అలాగే గ్యాస్, మలబద్దకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ చిట్కాను వాడడం వల్ల చాలా తక్కువ సమయంలోనే ఉపశమనాన్ని పొందవచ్చు. కడుపు నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ చిట్కాను వాడడం వల్ల చాలా తక్కువ సమయంలో చక్కటి ఫలితాలను పొందవచ్చు.