Dry Strawberries : వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మన శరీరంలో యాంటీ బాడీస్ విడుదలై వైరస్, బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్ ల నుండి మనల్ని కాపాడతాయని మనకు తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి ఈ యాంటీ బాడీస్ ఉత్పత్తి కొందరిలో ఎక్కువగా ఉంది కొందరిలో తక్కువగా ఉంది. ఈ యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయితేనే మన ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో రక్షణ వ్యవస్థలో ఉండే బి కణాలు ( బి లింపోసైట్స్) యాంటీ బాడీస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే ఈ బి కణాలకు కొన్ని పోషకాలు అవసరం. ఈ పోషకాలు అందితేనే బి కణాలు యాంటీ బాడీస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.
ఈ బి కణాలకు అవసరమయ్యే పోషకాలను కలిగి ఉండే ఆహారాల్లో స్ట్రాబెర్రీలు ఒకటి. 100 గ్రాముల స్ట్రాబెర్రీస్ లో 50 గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే వీటిలో కెరొటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటితో పాటు సాంగుయిన్ హెచ్ 6 అనే రకాల యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. స్ట్రాబెర్రీస్ లో ఉండే ఈ పోషకాలన్నీ బి సెల్స్ నుండి యాంటీ బాడీస్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి శరీరం దీర్ఘకాలం పాటు వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉండాలంటే యాంటీ బాడీస్ తగు మోతాదులో ఉండడం చాలా అవసరం.
యాండీ బాడీస్ ఉత్పత్తిని పెంచే ఈ స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల మన ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటామని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ స్ట్రాబెర్రీలు మనకు తాజా పండ్ల రూపంలో అలాగే డ్రై ఫ్రూట్ రూపంలో కూడా లభిస్తున్నాయి. వీటిని ఏ రూపంలో తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. రోజులో ఎప్పుడోకప్పుడు వీటిని తీసుకోవడం వల్ల సహజ సిద్దంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో భవిష్యత్తులో ఎన్ని రకాల వైరస్, బ్యాక్టీరియాలు మన శరీరంపై దాడి చేసినా మనం అనారోగ్యాల పాలు కాకుండా ఆరోగ్యంగా ఉంటాము. కనుక స్ట్రాబెర్రీలను ఇతర పండ్ల వలె నిత్యం ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.