Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home food

Beetroot Paratha : బీట్‌రూట్ ప‌రోటాల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..

D by D
March 28, 2023
in food, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Beetroot Paratha : మ‌నం బీట్ రూట్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా బీట్ రూట్ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. మ‌నం సాధార‌ణంగా బీట్ రూట్ ను స‌లాడ్ గా, జ్యూస్ గా లేదా ఫ్రై లా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇవే కాకుండా బీట్ రూట్ తో మ‌నం ఎంతో రుచిగా ఉండే ప‌రాటాల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. బీట్ రూట్ ప‌రాటాలు క‌ల‌ర్ ఫుల్ గా, చాలా రుచిగా ఉంటాయి. మ‌న ఆరోగ్యానికి మేలు చేసే బీట్ రూట్ తో ప‌రాటాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బీట్ రూట్ ప‌రాటా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బీట్ రూట్ – 1 ( పెద్ద‌ది), గోధుమ‌పిండి – మూడు క‌ప్పులు, పంచ‌దార – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ప‌చ్చిమిర్చి పేస్ట్ – 2 టీ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్.

Beetroot Paratha recipe in telugu very tasty and healthy
Beetroot Paratha

బీట్ రూట్ ప‌రాటా త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో బీట్ రూట్ ముక్క‌లు , కొద్దిగా నీళ్లు వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి. త‌రువాత గోధుమ‌పిండిలో మిక్సీ ప‌ట్టుకున్న బీట్ రూట్ పేస్ట్ తో పాటు మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత దీనిపై మూత‌ను ఉంచి పిండిని 15 నిమిషాల పాటు నాన‌బెట్టుకోవాలి. త‌రువాత పిండిని మ‌రోసారి బాగా క‌లుపుకుని ఉండ‌లుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ఉండ‌ను తీసుకుంటూ పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా రుద్దుకోవాలి. ఇలా అన్నింటిని త‌యారు చేసుకున్న త‌రువాత ఒక్కో చ‌పాతీని పెనం మీద వేసి కాల్చుకోవాలి. వీటిని నూనె వేస్తూ రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీట్ రూట్ ప‌రాటా త‌యార‌వుతుంది. వీటిని ఏ కూర‌తో తిన్నా లేదా నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా బీట్ రూట్ తో ప‌రాటాల‌ను చేసుకుని తినడం వ‌ల్ల మ‌నం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు. ఈ బీట్ రూట్ ప‌రాటాల‌ను పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తింటారు.

Tags: Beetroot Paratha
Previous Post

Jeelakarra Sompu Kashayam : రోజూ దీన్ని తాగితే చాలు.. ఎలాంటి జీర్ణ రోగాలు ఉండ‌వు..!

Next Post

Chilly Baby Corn : రెస్టారెంట్లలో ల‌భించే చిల్లీ బేబీ కార్న్‌.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

రాత్రి పూట ఇలా చేస్తే ప‌డుకున్న వెంట‌నే నిద్ర ప‌ట్టేస్తుంది..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

భార‌తీయ మ‌హిళ‌ల్లో పెరుగుతున్న గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు ఉంటే జాగ్ర‌త్త‌..!

July 4, 2025
వైద్య విజ్ఞానం

మీకు డ‌యాబెటిస్ ఉందా..? అయితే మీ చ‌ర్మం ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

July 4, 2025
international

పాకిస్థాన్‌తో భార‌త్ ర‌ద్దు చేసుకున్న నీటి ఒప్పందం క‌రెక్టే అంటారా..?

July 4, 2025
business

ఎలాన్ మస్క్‌ను నేటి తరంలో అత్యుత్తమ శాస్త్రవేత్త అనవచ్చా? కేవలం వ్యాపారవేత్త అనుకోవాలా?

July 4, 2025
inspiration

పేద‌రికాన్ని ఎగ‌తాళి చేయ‌కూడ‌దు.. ప్ర‌తిభ ఎక్క‌డ ఉన్నా ప్రోత్స‌హించాల‌ని చెప్పే క‌థ‌..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.