Fennel Seeds Ginger Milk : మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, నీరసం, అలసట, నరాల బలహీనత వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. పూర్వకాలంలో ఈ సమస్యలు కేవలం పెద్ద వారిలో మాత్రమే వచ్చేవి. కానీ నేటి తరుణంలో వయసుతో సంబంధంల లేకుండా ఈ సమస్యలు అందరిలో వస్తున్నాయి. ఈ కాలంలో మనలో చాలా మంది జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో శరీరానికి కావల్సిన పోషకాలు అందక అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. మన శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పులు, నీరసం, అలసట, వెన్ను నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ పాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
అయితే సాధారణ పాలను తీసుకోవడానికి బదులుగా ఈ పాలల్లో మరో రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని చక్కటి ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. పాలల్లో కలపవలసిన ఆ రెండు పదార్థాలు ఏమిటి… అలాగే ఈ పాలను ఏ విధంగా తీసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. పాలల్లో కలపవలసిన ఆ రెండు పదార్థాలు మరేమిటో కాదు అవి సోంపు గింజలు మరియు అల్లం. ఇవి రెండు మన ఇంట్లో ఉండేవే. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకోవాలి. వీటిని కొద్దిగా మరిగించిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ సోంపు గింజలను, ఒక ఇంచు అల్లం ముక్కలను వేసి పాలను మరిగించాలి.
ఈ పాలను 5 నిమిషాల పాటు మరిగించిన తరువాత వాటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచి కొరకు ఒక టీ స్పూన్ తేనెను లేదా అర టీ స్పూన్ పటిక బెల్లం పొడిని కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న పాలను పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఈ పాలను పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరానికి తగినంత శక్తి లభించి నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ పాలను తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పాలను తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
ముఖం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా ఈ పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఈ పాలను తీసుకున్న వారం రోజుల్లోనే మన శరీరంలో వచ్చే మార్పును మనం చాలా సులభంగా గమనించవచ్చని వారు తెలియజేస్తున్నారు.