Walnuts Laddu : నేటి తరుణంలో మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో ఐరన్ లోపించడం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది. ఐరన్ లోపించడం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గి శరీరంలో కణాలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీని కారణంగా నీరసంగా అనిపించడం, ఉత్సాహంగా ఉండలేకపోవడం, ఏ పని మీద శ్రద్ద పెట్టలేకపోవడం, జుట్టు రాలడం, చర్మం పొడి బారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎముకలు ధృడంగా ఉండాలన్నా, కండరాలు సక్రమంగా పని చేయాలన్నా మన శరీరానికి తగినంత ఐరన్ అందించడం చాలా అవసరం. మన ఇంట్లోనే మనకు సులభంగా లభించే పదార్థాలతో సులభంగా లడ్డూను తయారు చేసుకుని తినడం వల్ల చాలా సులభంగా మనం రక్తహీనతను తగ్గించుకోవచ్చు.
ఈ లడ్డూలను తయారు చేయడం చాలా సులభం.రక్తహీనతను తగ్గించే లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లడ్డూలను తయారు చేసుకోవడానికి గానూ మనం వాల్ నట్స్ ను, నువ్వులను, తాటి లేదా నల్ల బెల్లాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో 50 గ్రాముల వాల్ నట్స్ ను, 50 గ్రాముల నువ్వులను, 50 గ్రాముల తాటి బెల్లాన్ని తీసుకోవాలి. తరువాత వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనతను తగ్గించే లడ్డూలు తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినవచ్చు.
ఈ లడ్డూలను నేరుగా తినవచ్చు లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ లడ్డూలను తీసుకోవడం వల్ల ఐరన్ తో పాటు మన శరీరానికి కావల్సిన ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. ఈ లడ్డూలను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. నీరసం, బలహీనత వంటి సమస్యలు దూరమవుతాయి. ఈ విధంగా లడ్డూలను తయారు చేసుకుని తినడం వల్ల మనం చాలా సులభంగా రక్తహీనత సమస్యను దూరం చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.