Sattu Drink : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనిని పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసుకుని తాగేవారు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. సలుభంగా బరువు తగ్గవచ్చు. దీనిని తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి. .తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సత్తు డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పుట్నాల పప్పు – రెండు కప్పులు, ఉప్పు – అర టీ స్పూన్, నల్ల ఉప్పు – అర టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 2 గ్లాసులు, నిమ్మరసం – అర చెక్క, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
సత్తు డ్రింక్ తయారీ విధానం..
ముందుగా జార్ లో పుట్నాలపప్పును తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని 6 టేబుల్ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత మిగిలిన నీటిని పోసి కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలను వేసి కలిపి గ్లాస్ లో పోసి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సత్తు డ్రింక్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు చాలా సులభంగా లభిస్తాయి. ఇలా పుట్నాల పప్పుతో చాలా తక్కువ ఖర్చులో డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.