Macadamia Nuts : శరీరం బలంగా, ధృడంగా అవ్వాలంటే మనం ఎక్కువగా బలమైన ఆహారాలను తీసుకోవాలి. చాలా మంది బలమైన ఆహారం అనగానే మాంసం అని చెబుతూ ఉంటారు. కానీ మాంసం కంటే కూడా అనేక రకాల బలమైన ఆహారాలు ఉంటాయి. మాంసం కంటే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఎక్కువ బలమైన ఆహారాలని నిపుణులు చెబుతున్నారు. డ్రై నట్స్ ను తీసుకోవడం వల్ల శరీరం మరింత బలంగా తయారవుతుందని డ్రై నట్స్ లో మెకడమియా నట్స్ అన్నింటి కంటే బలవర్దకమైన నట్స్ అని వారు చెబుతున్నారు. 100 గ్రా. మెకడమియా నట్స్ లో 740 క్యాలరీల శక్తి ఉంటుంది. అలాగే 100 గ్రాముల జీడిపప్పులో 596 క్యాలరీల శక్తి , పిస్తా పప్పులో 626 క్యాలరీల శక్తి, బాదం పప్పులో 655 క్యాలరీల శక్తి, వాల్ నట్స్ లో 687 క్యాలరీల శక్తి ఉంటుంది. అదే విధంగా 100 గ్రాముల చేపలల్లో 80 నుండి 90 క్యాలరీల శక్తి, చికెన్ లో 109 క్యాలరీల శక్తి ఉంటుంది.
కనుక మాంసం కంటే కూడా మెకడమియా నట్స్ లో ఎక్కువ శక్తి ఉంటుందని వారు అలాగే ఈ నట్స్ చాలా రుచిగా ఉంటాయని కూడా వారు చెబుతున్నారు. అలాగే ఈ నట్స్ లో మన శరీరానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా మారడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో కూడా ఈ నట్స్ మనకు సహాయపడతాయి. అలాగే ఈ మెకడమియా నట్స్ లో కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఈ నట్స్ లో గ్లైసమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఈ నట్స్ ఒక చక్కటి వరమని చెప్పవచ్చు. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. నీరసం రాకుండా ఉంటుంది. షుగర్ వ్యాధి గ్రస్తులు వీటిని తీసుకోవడం వల్ల నీరసం, బలహీనత వంటివి తగ్గి శరీరానికి బలం చేకూరుతుంది.
బరువు కూడా పెరగచ్చు. అదే విధంగా ఊబకాయంతో బాధపడే వారు ఈ మెకడమియా నట్స్ ను తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో ఇతర ఆహారాల వైపు చూపు మళ్లకుండా ఉంటుంది. అదే విధంగా సన్నగా ఉండి బరువు పెరగాలనుకునే వారు, గర్బిణీలు, బాలింతలు, ఆటలాడే వారికి ఈ నట్స్ ఎంతో మేలు చేస్తాయి. ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, పక్షవాతం వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ నట్స్ ను రోజుకు 4 నుండి 5 గింజల మోతాదులో నానబెట్టి తీసుకోవాలి. పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా వీటిని తీసుకోవచ్చు. ఈ విధంగా మెకడమియా నట్స్ అన్నింటికంటే బలమైన ఆహారమని వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.