Mint Leaves Lemon Tea : లెమన్ టీ.. ఈ టీ ని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ టీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తాగుతారు. రుచితో పాటు ఈ టీ ని తాగడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు లెమన్ టీ ని తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ టీ ని తాగడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మన దరిచేరకుండా ఉంటాయి. ఈ లెమన్ టీ ని తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము.
ఈ టీ ని తాగడం వల్ల జలుబు, జ్వరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో బాధపడేటప్పుడు ఈ టీ ని తాగడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఈ టీ ని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో మనం బరువు సులభంగా తగ్గవచ్చు. ఈ లెమన్ టీ ని తీసుకోవడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాల నొప్పులతో బాధపడుతున్నప్పుడు లెమన్ టీ ని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా లెమన్ టీ మనకు దోహదపడుతుంది. శరీర ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ లెమన్ టీ మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధంగా లెమన్ టీ మనకు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని వారు సూచిస్తున్నారు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ లెమన్ టీ ని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ టీ ని తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని తీసుకోవాలి.
ఇందులో ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేసి నీటిని వేడి చేయాలి. ఈ డికాషన్ ను రెండు నిమిషాల పాటు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి కప్పులో పోసుకోవాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని, రుచికి తగినంత తేనెను వేసి కలపాలి. తరువాత ఇందులో రెండు లేదా మూడు పుదీనా ఆకులను వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా లెమన్ టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.